I dont invite chiranjeevi says Balakrsihna

I dont invite chiranjeevi says balakrsihna

chiranjeevi, balakrishna, Lepakshi, Lepakshi Ustavalu

I dont invite chiranjeevi says Balakrsihna. Lepakshi Ustavalu balakrishna gave sensational comments on Chiranjeevi.

చిరంజీవిని పిలవలేదు: బాలకృష్ణ వ్యాఖ్య

Posted: 02/25/2016 09:35 AM IST
I dont invite chiranjeevi says balakrsihna

హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. ఒక్క సారిగా పొలిటిక‌ల్ హీట్ రాజేశారు. నేరుగా చిరంజీవిని టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు క‌ల‌క‌లం రేపాయి. కాంగ్రెస్ పార్టీ నాయ‌కుడు, ఎంపీ, మాజీ కేంధ్రమంత్రి చిరంజీవిని లేపాక్షి ఉత్సవాల‌కు ఆహ్వానించ‌క‌పోవ‌డంపై మీడియా ప్రశ్నించిన‌ప్పుడు బాల‌య్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్నాయి. తాను ఎవ‌రిని పిల‌వాలో త‌న‌కు తెలుసంటూ వ్యక్తిగ‌త కార్యక్రమం మాదిరిగా మాట్లాడ‌డం పెద్ద విమ‌ర్శల‌కు దారితీసే అవ‌కాశం క‌నిపిస్తోంది.

ఈనెల 27 నుంచి రెండు రోజుల పాటు లేపాక్షి ఉత్సవాలు ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నట్టు బాల‌య్య ప్రక‌టించారు. తాను డిక్టేట‌ర్ మాదిరిగానే ప్రవ‌ర్తిస్తానంటూ ఆయ‌న చెప్పడం విస్మయం క‌లిగించింది. నా ప‌క్కన గ్లామ‌ర్ ఉన్న వాళ్లు ఉన్నారు..వాళ్లతోనే నేను సెయిల్ అవుతా త‌ప్ప‌..నా క‌ష్టార్జితాన్ని ఎవ‌రికీ అప్పగించే ప్రశ్నేలేద‌ని తెలిపారు. ఎవ‌రినీ నెత్తిన ఎక్కాల‌ని చూస్తే పిల‌వ‌ను అంటూ చెప్పుకొచ్చారు. మొత్తానికి చిరంజీవికి, తనకు మధ్య ఉన్న విభేదాలను వెల్లడిస్తూ.. బలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అటు రాజకీయంగా, సినీపరంగా కూడా కలకలాన్ని సృష్టిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chiranjeevi  balakrishna  Lepakshi  Lepakshi Ustavalu  

Other Articles