woman gang raped in car on way back from gurgaon mall

Woman gang raped inside moving car in gurgaon

Gurgaon, Rape case, Gangrape, Munirka, Sahara Mall, Delhi, MG Mall, Police, MG Road, rape on women, Beverley Park-1, attrocity on women, harrasment on women

A 26-year-old Delhi woman was allegedly gang-raped by three men in a car on Sunday night when she was returning from a club at Sahara Mall on MG Road in Gurgaon.

దేశరాజధానిలో వివాహితపై.. కదులుతున్న కారులో గ్యాంగ్ రేప్

Posted: 02/24/2016 06:44 PM IST
Woman gang raped inside moving car in gurgaon

ఓ మహిళను కిడ్నాప్ చేసి.. కారులో అమెపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి  పాల్పడిన దారుణ ఘటన గుర్గావ్ లో చోటుచేసుకుంది. ఎంజీ రోడ్డులోని సహారా మాల్ నుంచి తిరిగి వస్తున్న 26 ఏళ్ల మహిళపై ఆదివారం అర్ధరాత్రి ఈ అఘాయిత్యం జరిగింది. బెవెర్లీ పార్క్-1 ప్రాంతం నుంచి అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో కారులో ఆమెను ఎత్తుకుపోయి ముగ్గురు వ్యక్తులు ఈ దారుణానికి ఒడిగట్టారు. సోమవారం ఉదయం బాధితురాలు వసంత్ విహార్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసును పోలీసులు గుర్గావ్ కు బదిలీ చేశారు.

బాధితురాలు తన రెండేళ్ల కొడుకుతో కలిసి ఢిల్లీలోని మునిర్కా ప్రాంతంలో నివసిస్తోందని పోలీసులు తెలిపారు. గుర్గావ్ నుంచి తిరిగి వస్తుండగా ఆమెపై గ్యాంగ్ జరిగిందని, గుర్తు తెలియని దుండగులపై కేసు నమోదు చేశామని సెక్టార్ 29 పోలీస్ స్టేషన్ ఏసీపీ డీఎల్ఎఫ్ రమేశ్ పాల్ వెల్లడించారు.ఇంటికి చేరుకునేందుకు ఇఫ్కో చౌక్ వద్ద ఆటో ఎక్కిన ఆమెను బెవెర్లీ పార్క్-1 సమీపంలో తెల్లరంగు కారులో వచ్చిన వ్యక్తులు అడ్డగించి తమతో తీసుకెళ్లారని.. కారులో ముగ్గురు పురుషులతో పాటు మహిళ కూడా ఉందని తెలిపారు. గోల్ఫ్ కోర్సు రోడ్డు వైపుగా తీసుకెళ్లి నిర్మానుష్య ప్రాంతంలో బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారని చెప్పారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gurgaon  Rape case  Gangrape  Munirka  Sahara Mall  Delhi  MG Mall  Police  

Other Articles