106 year old woman dance with Obama and Michelle

106 year old woman dance with obama and michelle

Obama, America, 106year old lady, Virginia McLaurin

A 106-year-old woman proved she had more energy than most people half her age when she danced her way into the White House to meet the President. Unable to contain her excitement at meeting Barack and Michelle Obama, Virginia McLaurin held her arms in the air and danced excitedly when introduced to the President and First Lady.

ITEMVIDEOS: ఒబామాతో స్టెప్పులేసిన 106 ఏళ్ల బామ్మ

Posted: 02/23/2016 09:41 AM IST
106 year old woman dance with obama and michelle

అతడేమో అమెరికా అధ్యక్షుడు.. ఆమె పండు ముసలి.. కానీ ఆమె ఊపు చూసిన అధ్యక్షుడు, ప్రధమ మహిళ ఇద్దరూ కూడా స్టెప్పులేశారు. వయస్సు అనేది కేవలం మనస్సుకు సంబందించిందని ఆ బామ్మ నిరూపించింది. వైట్ హౌస్ కి వచ్చిన వర్జీనియా మెక్ లారిన్ అనే 106 సంవత్సరాల వయస్సున్న మహిళ బరాక్ ఒబామా, ఆయన భార్య మిచెల్లీ ఒబామాతో కలిసి సరదాగా గడిపారు. గతంలో 18 మంది అమెరికా అధ్యక్షులను కూడా కలుసుకుంది. ఆమె ఆఫ్రికన్-అమెరికన్ మహిళ. ఈమె లాగే ఆఫ్రికన్ అమెరికన్ వ్యక్తి దేశానికి అధ్యక్షుడు కావాలని కోరుకుంది. ఇప్పుడు బరాక్ ఒబామా అధ్యక్షుడు కావడంతో వైట్ హౌస్ లో ఆ దంపతుల్ని కలుసుకుంది. ఉద్వేగంతో ఆమె డ్యాన్స్ కూడా చేసేసింది. ఆమెను ఆప్యాయంగా పలకరించి…ఆమె స్టెప్పులకు ఒబామా దంపతులు కూడా కాళ్ళు కదిపారు.

{youtube}ewdDr81xwCM|620|400|1{youtube}

తన వయసును మరిచిపోయి ఎంతో సంతోషంగా ఆమె కాసేపు గడిపింది. హాయ్ అని గట్టిగా వారిని పలకరించింది. ఇది తనకు మరచిపోలేని అనుభూతి, తనకిచ్చిన గౌరవాన్ని ఎప్పటికీ మరిచిపోలేనని ఆమె పేర్కొంది. వైట్ హౌస్ లో జరిగిన బ్లాక్ హిస్టరీ మంత్ లో ఆమె పాల్గొంది. 2013లో 104 ఏళ్ళ మెక్ లారిన్ ను సన్మానించింది అమెరికా ప్రభుత్వం. సౌత్ కరోలినా లో 1909లో పుట్టిన మెక్ లారిన్ 1941 లో వాషింగ్టన్ కు వచ్చేసింది. ఒబామాతో చేసిన డ్యాన్స్ తాలూకు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Obama  America  106year old lady  Virginia McLaurin  

Other Articles