telangana cm KCR trying to provide road facility to every village

Telangana cm kcr trying to provide road facility to every village

Telangana, KCR, Roads, R & B

telangana cm KCR trying to provide road facility to every village. KCR dicussed Road facilities to villages in the state.

ప్రతి గ్రామానికి రోడ్డు: కేసీఆర్

Posted: 02/23/2016 09:08 AM IST
Telangana cm kcr trying to provide road facility to every village

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్ అండ్ బీ శాఖపై సమీక్ష నిర్వహించారు సీఎం కేసీఆర్. బడ్జెట్ ప్రతిపాదనలపై అధికారులతో చర్చించారు. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ లైన్ రోడ్లు, జిల్లా కేంద్రాల నుంచి రాజధానికి నాలుగు లైన్ల రోడ్ల నిర్మాణానికి నిర్ణయించారు. ప్రతి గ్రామానికి కచ్చితంగా రోడ్డు ఉండేలని నిర్ణయించారు. అంతేకాకుండా ఏడాదిలోగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు క్యాంప్ ఆఫీసులు నిర్మిస్తామని తెలిపారు సీఎం కేసీఆర్. R&B శాఖలో నిర్ణీత వ్యవధిలో నిర్మాణాలు చేపట్టే కాంట్రాక్టర్లకు 1.5 శాతం ఇన్సెంటీవ్స్ ఇవ్వాలని నిర్ణయించారు కేసీఆర్.

అలాగే ఎన్టీఆర్ స్టేడియంలో కళా భారతి నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేలా కళాభారతి ఉండాలన్నారు సీఎం. అసెంబ్లీ స్పీకర్, మండలి ఛైర్మన్, సీఎంతోపాటు సీఎస్, ఐఏఎస్ అధికారులకు అధునాతన క్వార్టర్స్ నిర్మిస్తామన్నారు. నిర్మాణాల కోసం సీఎస్ అధ్యక్షతన ఆరుగురు సభ్యులతో కమిటీ ఉంటుందని తెలిపారు. మొత్తానికి తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణలో మెరుగైన రవాణ సౌకర్యాలను కల్పించేందుకు చర్యలకు ఉపక్రమించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  KCR  Roads  R & B  

Other Articles