Gold Tops Rs 29K-level Again on Global Cues, Domestic Demand

Marraige season effect gold price rise in indian domestic market

Live, GOLD rate/price in India Live, GOLD price, GOLD rate today Live, gold price today, GOLD rates India, gold price per gram, GOLD chart, GOLD price per gram, GOLD funds, bullion stocks, GOLD Price India, GOLD Price Forecast.

Riding on a firm global trend and strong demand from domestic jewellers, gold prices shot up by Rs 540, topping the 29,000 mark again, to close at Rs 29,290 per 10 gramsGOLD rates/price

పెళ్లిళ్ల సీజన్ రాకతో మెరుస్తున్న స్వర్ణం.. 29 వేల మించి పయనం..

Posted: 02/20/2016 12:43 PM IST
Marraige season effect gold price rise in indian domestic market

దేశీయంగా నెలకొన్న పటిష్ట డిమాండ్ పసిడికి మెరుపునిచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా బంగారం మెరుపులు తలుక్కుమనడంతో పాటు దేశీయంగా వివాహాది శుభకార్యాలకు ముహుర్తాలు రావడం కూడా కుందనానికి వెలుగులను ఇచ్చింది. ముంబై స్పాట్ మార్కెట్‌లో 10 గ్రాములు 99.9 స్వచ్ఛత ధర గురువారం ముగింపుతో పోల్చిచూస్తే.. రూ.525 ఎగసి రూ.29,095కు చేరింది. 99.5 స్వచ్ఛత ధర సైతం అంతే స్థాయిలో ఎగసి రూ.28,945 పెరిగింది. ఇక వెండి కేజీ ధర రూ.395 ఎగసి రూ.37,690కి పెరిగింది. ముంబైలోనే కాకుండా దేశ వ్యాప్తంగా ప్రధాన స్పాట్ మార్కెట్లు అన్నింటిలో పసిడి ధర క్రితం రోజు భారీగా ఎగసింది.

దేశీయంగా పెళ్లిళ్ల సీజన్, స్టాకిస్టులు, ఆభరణాల వర్తకుల కొనుగోళ్లు తాజా డిమాండ్‌కు ప్రధాన కారణమని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కాగా కడపటి సమాచారం అందేసరికి అటు అంతర్జాతీయ, ఇటు దేశీయ ఫ్యూచర్స్ కమోడిటీ మార్కెట్లలో కూడా పసిడి లాభాల్లోనే ట్రేడవుతోంది. అంతర్జాతీయంగా నెమైక్స్‌లో చురుగ్గా ట్రేడవుతున్న ఏప్రిల్ కాంట్రాక్ట్ ధర ఔన్స్ (31.1గ్రా)కు ఐదు డాలర్ల లాభంతో 1,231 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. దేశీయంగా మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో రూ.250 లాభంతో రూ.29,560 వద్ద ట్రేడవుతోంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chiranjeevi supports to samaikyandhra
Pcc chief botsa press meet  
Rate This Article
(0 votes)
Tags : Gold  domestic market  marriages  spot market  India  

Other Articles