SC restrains Madras High Court judge from passing any order

Sc restrains madras high court judge from passing any order

Supreme Court, Apex Court, madras High Court, Justice C S karnan

The court also stayed operation of all the orders passed by Justice C S Karnan after his transfer to the Calcutta High Court on February 12. The apex court passed the order after the controversial judge went to the extent of seeking a written statement from the Chief Justice of India and staying the order on his transfer.

మద్రాస్ హైకోర్టు జస్టిస్ సంచలనం.. సుప్రీం ఆదేశంపై స్టే

Posted: 02/16/2016 09:07 AM IST
Sc restrains madras high court judge from passing any order

దేశంలో ఎన్నడూ చూడని ఘటన న్యాయవ్యవస్థలో చోటుచేసుకుంది. సుప్రీంకోర్టు కాదు అన్న న్యాయమూర్తి సొంతంగా స్టే ఇచ్చి వివాదాన్ని కొత్త మలుపు తిప్పారు. పైగా తన కులం కారణంగానే తనను అణగదొక్కుతున్నరని వ్యాఖ్యానించారు. మద్రాస్ హైకోర్ట్ జడ్జి జస్టిస్ కర్ణన్ తీసుకున్న నిర్ణయం దేశ చరిత్రలో ఎన్నడూ కనీవినీ ఎరుగనిది. సుప్రీంకోర్టు ఆదేశంపై ‘స్టే’ఇవ్వడంతో పాటు భారత చీఫ్ జస్టిస్ ను ‘సమాధానం’ఇవ్వాలని ఆదేశించారు.  సుప్రీంకోర్టు తనను కలకత్తా  హైకోర్టు కు బదిలీచేస్తూ ఇచ్చిన ఆర్డర్ పై మద్రాస్ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ సిఎస్. కర్ణన్ ‘స్టే’ ఇచ్చారు. ట్రాన్స్ ఫర్ ఆర్డర్ కు సంబంధించి హైకోర్టుకు  లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియానే ఆదేశించారు.  ఏప్రిల్ 29 వరకూ గడువు కూడా ఇచ్చారు.  ఆ నాటి వరకూ బదిలీ అమలు కాకుండా  తాత్కాలిక స్టే ఆదేశంకూడా జారిచేశారు.

జస్టిస్ కర్ణన్ ను కలకత్తా  హైకోర్టుకు బదిలీచేస్తూ సుప్రీంకోర్టు జారీ చేసిన ఆర్డర్ ను ‘రెకమెండేషన్ ఆర్డర్’ అని,చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా  తన న్యాయపరిధిలో జోక్యం చేసుకోరాదని  కర్ణన్ పేర్కొన్నారు. సీజేఐ ను ‘మై లార్డ్ షిప్’ అని గౌరవిస్తూనే, తన న్యాయపరిధివిషయంలో జోక్యం చేసుకోవద్దని సలహా ఇచ్చారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. జస్టిస్ కర్ణన్ కు ఎలాంటి జుడీషియల్ వర్క్  అప్పగించవద్దని  మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ను ఆదేశించింది.  మద్రాస్ హైకోర్టు రిజిస్ట్రార్ అయిన  చీఫ్ జస్టిస్ ప్రైవేటు సెక్రటరీ అపీలు మేరకు సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీచేసింది. కాగా,  కోర్టులోనే జస్టిస్ కర్ణన్  మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు యత్నించారు. హైకోర్టు పాలనాయంత్రాంగం కోర్టు ప్రాంగణంలోకి టీవీ కెమెరాలను అనుమతించలేదు.  దీంతో జడ్జి కోర్టు బయటకు వచ్చి , మీడియాతో మాట్లాడారు.

భారతలో పుట్టినందుకు సిగ్గు పడుతున్నానని వివాదాస్పద న్యాయమూర్తి జస్టిస్‌ కర్ణన్‌ వ్యాఖ్యానించారు. దళితుడిని అయినందుకే తనను వేధిస్తున్నారని ఆరోపించారు. దేశంలో కుల పిచ్చి అధికంగా ఉందని, అగ్ర వర్ణాల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయని ఆరోపించారు. తమలాంటి దళితులకు తీవ్ర అన్యా యం జరుగుతోందని, దీనిపై పార్లమెంటులో చర్చ జరిగేలా చేస్తానని చెప్పారు. కుల వ్యవస్థ లేని దేశానికి వెళ్లిపోవాలని అనుకుంటున్నానని ఆయన వ్యాఖ్యానించారు.  తాను కొంతమంది న్యాయమూర్తులపై సందేహాలు వ్యక్తంచేసినప్పుడు, వారిపై ఆరోపణలు చేసినప్పుడు వాటికి జవాబు చెప్పడానికి బదులుగా వారు తనపై ఉత్తర్వులు జారీచేస్తున్నారని ఆరోపించారు. తాను అమాయకుడినని, దీనిపై పార్లమెంటు నిర్ణయం తీసుకోవాలని స్పష్టంచేశారు. తన మధ్యంతర ఉత్తర్వు కాపీని ప్రతిపక్ష నాయకురాలు కనకనే సోనియా గాంధీకి పంపానని, ఆమె తనకు అనుకూలంగా గళం ఎత్తుతుందని జస్టిస్‌ కర్ణన్‌ ఆశాభావం వ్యక్తంచేశారు. మాయావతి, రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ తమ కులం నాయకులని, ఇతర ఎంపీలతోపాటు వారు కూడా మద్దతిస్తారని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Supreme Court  Apex Court  madras High Court  Justice C S karnan  

Other Articles