Apex court said that Prostitution is not illegal

Apex court said that prostitution is not illegal

Supreme court, Prostitution, India, Apex Court

Prostitution being illegal in India often makes prostitutes vulnerable to police action. Supreme Court panel on said that it is not a crime when adults voluntarily participate in prostitution. It also added that prostitution shouldn’t face criminal action or interference by the police.

వ్యభిచారం తప్పుకాదు : సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్య

Posted: 02/15/2016 03:33 PM IST
Apex court said that prostitution is not illegal

వ్యభిచారం తప్పుకాదని, సెక్స్ వర్కర్లను అరెస్ట్ చేయవద్దంటూ సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.  సెక్స్ వర్కర్ల హక్కులను కాపాడే దిశగా  సుప్రీం 2011లో ఓ కమిటీ  నియమించింది. ఆ కమిటీ పొట్టకూటికోసం వ్యభిచారాన్ని వృత్తిగా స్వీకరించడం వ్యతిరేకం కాదని, అయితే, వ్యభిచార గృహం నిర్వహించడం మాత్రం తప్పేనని ఈ కమిటీ వచ్చే నెలలో సిఫార్సులను చేయనుంది. అంతేకాదు పోలీసులు ఓ వ్యభిచార గృహంలపై దాడి చేస్తే అరెస్ట్ లు, జరిమానాలు చేయోద్దని కమిటీ సూచించనున్నట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఎవరిపైనైనా సెక్స్ వర్కర్లు కేసు పెడితే, దాన్ని కూడా ప్రస్తుత చట్టాలకు అనుగుణంగా విచారణ జరిపి కేసులు నమోదు చేయాలని కమిటీ సిఫార్సు చేయనుంది. ఇక వ్యభిచార గృహాలను నిర్వహిస్తున్న వారు పట్టుబడితే, పదేళ్ల వరకూ జైలుశిక్ష విధించేలా చట్టాన్ని సవరించాలని కమిటీ సూచించింది. భారత్‌లో పేదరికం కారణంగా అధికారిక అంచనాల ప్రకారం సుమారు 12 లక్షల మంది ఈ వ్యభిచార వృత్తిలో ఉన్నారు. కాగా మొదటిసారిగా వ్యభిచారులకు అనుకూలంగా సుప్రీంకోర్టు సిఫార్సులు చెయ్యడము విశేషమే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Supreme court  Prostitution  India  Apex Court  

Other Articles