Wife attacks husband and lover in Nellore

Wife attacks husband and lover in nellore

Nellore, Husband, Attack on Husband and lover

In Nellore, a wife caught her husband with his lover and she attacks on her husband and lover.

ITEMVIDEOS: అటకెక్కిన ప్రియురాలు.. చితకబాదిన ఇల్లాలు

Posted: 02/15/2016 11:28 AM IST
Wife attacks husband and lover in nellore

ఏంటీ.. ఇదేదో సినిమా టైటిల్ లాగా ఉందనుకుంటున్నారేమో కానీ మ్యాటర్ మాత్రం చాలా హాట్. ఓ ప్రబుద్దుడు ఇంట్లో ఇల్లాలు... వంటింట్లో ప్రియురాలు అన్నట్లు గుట్టుగా ఇద్దరితో సంసారం చేస్తుండగా.. చిర్రెత్తుకువచ్చిన ఇల్లాలు చివకబాదింది. ఇల్లాలి భయానికి పాపం ప్రియురాలు అటకెక్కింది. అటెక్కిన ప్రియురాలిని కిందికి దించి మరీ చితకబాదింది ఇల్లాలు. ఇక మొత్తానికి కారణమైన ఇంటాయనను మాత్రం వదిలిపెట్టింది అనుకుంటున్నారేమో... ఉన్న కోపమంతా భర్త మీద చూపించి అతడి తాటతీసింది. అసలు ఏం జరిగిందంటే...

నెల్లూరు జిల్లా,  వెంకటాచలానికి చెందిన వెంకటేశ్, స్వప్నలు  14 ఏళ్లక్రితం ప్రేమవివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలుకూడా ఉన్నారు. కొంతకాలం వారి సంసారం బాగానే నడిచింది. తర్వాత భర్త ప్రవర్తనలో మార్పును గమనించిన భార్య ఎంతగానో నచ్చచెప్పిచూసింది. అయినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. నాలుగేళ్లుగా  అతను అసలు ఇంటికి కూడా రాకపోయేసరికి బంధువుల సహకారంతో అక్రమసంబంధం పెట్టుకున్న మహిళతో ఉండగా రెడ్ హ్యండెడ్ గా పట్టుకుంది స్వప్న. కట్టుకున్న భర్త మరో స్త్రీతో ఉండడాన్ని చూసిన స్వప్న ఆవేశం కట్టలు తెంచుకుంది. ఇంకేముంది చెప్పుతీసుకుని ఎడపెడా వాయించేసింది. అటకెక్కికూర్చున మహిళకు కూడా దుమ్ముదులిపేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Nellore  Husband  Attack on Husband and lover  

Other Articles