Telangana CM KCR expose his son KTR by impose Harish Rao

Telangana cm kcr expose his son ktr by impose harish rao

KTR, Harish Rao, TRS, KCR, GHMC, GHMC Elections, Narayankhed Elections, CM KCR, TRS party, Harish Rao Vs KTR

Telangana CM KCR expose his son KTR by impose Harish Rao. In GHMC Elections KCR show his political mind and he highlight KTR

కేటీఆర్ కు ఎత్తి.. హరీష్ ను తొక్కి.... కేసీఆర్ దెబ్బకు రెండు పిట్టలు

Posted: 02/15/2016 11:09 AM IST
Telangana cm kcr expose his son ktr by impose harish rao

ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న సామెత అందరికి తెలుసు. అయితే రాజకీయాల్లో కూడా అప్పుడప్పుడు ఇది జరుగుతూ ఉంటుంది. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన కొడుకు కేటీఆర్ కు టైన్ క్లీయర్ చేస్తున్నారు. నిజానికి హరీష్ రావును తప్పించేందుకు కేసీఆర్ వేసిన పద్మవ్యూహంలో అభిమన్యుడిలా హరీష్ చిక్కుకున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో హరీష్ రావు ఎంతో మందిలో స్పూర్తిని నింపారు. తెలంగాణ గురించి ఆయన చేసిన ప్రసంగాలు ఎంతో మంది విద్యార్థులను ఉద్యమం వైపు తిప్పాయి. అయితే ఎంతైనా కన్న కొడుకు ఓ పక్కన.. మేనల్లుడు ఓ పక్కన ఉంటే తన కొడుకుకే ఓటు వేయాల్సి వస్తుంది. కదా.. అయితే జిహెచ్ఎంసీ ఎన్నికలు కేంద్రంగా సాగిన కేసీఆర్ దెబ్బకు రెండు పిట్టలు కథ చదవండి.

జిహెచ్ఎంసీ ఎన్నికల బాధ్యతను సిఎం కేసీఆర్ తన కొడుకు, పంచాయితీరాజ్, ఐటీ మంత్రి కేటీఆర్ కు అప్పగించాడు. కేటీఆర్ కు పూర్తి స్వేచ్ఛనిస్తూ.. మంత్రులు మొత్తం కేటీఆర్ మాటకు కట్టుబడేలా చూశారు. నెలల ముందు నుండే కేటీఆర్ చేసిన రాజకీయ వ్యూహాలు ఎంతో తోడ్పడ్డాయి. గతంలో కనీసం పోటీ చెయ్యడానికి కూడా భయపడిన టీఆర్ఎస్ పార్టీ తిరుగులేని ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. 99 సీట్లతో సింగిల్ పార్టీ మేయర్ పీఠాన్ని సొంతం చేసుకోవడంలో కొత్త రికార్డును సొంతం చేసుకుంది. అయితే క్రెడిట్ మొత్తం కేటీఆర్ కు దక్కేలా కేసీఆర్ తీసుకున్న జాగ్రత్తల చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..

 * కేటీఆర్ కు జిహెచ్ఎంసీ ఎన్నికల బాధ్యతను అప్పగిస్తున్నట్లుగా ముందుగానే ప్రకటించడం
 * ఈటెల రాజేందర్, నాయిని నర్సింహారెడ్డి, తుమ్మల లాంటి సీనియర్ నాయకులను మీడియాలో ఎక్కడా కనిపించకుండా జాగ్రత్త తీసుకోవడం
 * ముఖ్యంగా హరీష్ రావును గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంచడం కేసీఆర్ రాజకీయ చతురతకు నిదర్శనం
 * కేటీఆర్ కు గ్రేటర్ ఎన్నికల బాధ్యత అప్పగించి... హరీష్ రావుకు మాత్రం నారాయణ్ ఖేడ్ ఎన్నికల ప్రచార బాధ్యతలు అప్పగించి కేసీఆర్ కేటీఆర్ కు దక్కాల్సిన క్రెడిట్ కు కాపాడగలిగారు

కేసీఆర్ తీసుకున్న ప్రతి స్టెప్ కూడా ఎంతో కీలకంగా మారింది. హరీష్ ను తెర మీద నుండి తప్పించి.. నిన్నటి దాకా హరీష్ రావు, కేటీఆర్ లలో నెంబర్ వన్ ఎవరు అన్న దానికి క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు గ్రేటర్ విజయం తర్వాత హైదరాబాద్ లో ఎక్కడ చూసినా కేటీఆర్ ఫోటోలతో భారీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. హరీష్ రావు ఫోటో అసలు ఫ్లెక్సీల్లో బూతద్దంలో పెట్టి వెతికినా కనిపించడం లేదు.

కేటీఆర్ కు హరీష్ రావుకు ఉన్న తేడా ఏంటో ఓ చూడండి..
 * టీఆర్ఎస్ పార్టీని స్థాపించినప్పటి నుండి కేసీఆర్ తో ఉన్న వ్యక్తి హరీష్ రావు. కేసీఆర్ కు హరీష్ రావే బలం కానీ కేటీఆర్ కు తన తండ్రి కేసీఆర్ బలం పైగా గత కొంత కాలంగా కేటీఆర్ హైలెట్ అవుతున్నారు తప్పితే అంతకు ముందు టీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా కేటీఆర్ మొహం పెద్దగా పరిచయం లేదు
 * తెలంగాణ ఉద్యమం నడిచే సమయంలో హరీష్ రావు ఉద్యమానికి అండగా నిలిచారు. ఎన్నో సార్లు పోలీసులు అరెస్టు చేసినా కానీ హరీష్ రావు మాత్రం వెనక్కి తగ్గలేదు. కానీ కేటీఆర్ మాత్రం ఉద్యమం పూర్తైంది అనుకున్న సమయంలో తెర మీదకు వచ్చారు.
 * హరీష్ రావు మాట్లాడితే ఎదుటి పక్షానికి చెందిన వాళ్లు ఎవరూ కూడా నోరు మెదపలేరు.. ప్రతి మాటకు లెక్కలు ఉంటాయి. కానీ కేటీఆర్ మాట్లాడితే పంచ్ లు ఉన్నా కానీ లెక్కల మీద పెద్దగా అవగాహన లేదు.
 * హరీష్ రావు ఎన్నడూ కూడా ప్రచారం కోసం తాపత్రయపడలేదు.. ఉద్యమమే ఊపిరిగా ముందుకు సాగారు. కానీ కేటీఆర్ తన కెరీర్ మొత్తం మీడియా హైలెట్ చెయ్యడం ద్వారానే బిల్డప్ చేసుకున్నారు.

కేటీఆర్ కు తెలంగాణ ప్రభుత్వంలో కీలకంగా మారుస్తూ... చెస్ లో ఏవిధంగా అయితే రాజుకు చెక్ చెబుతారో అదే మాదిరిగా హరీష్ రావుకు చెక్ చెప్పారు కేసీఆర్. తన కొడుకు గట్టి పునాదిని ఏర్పాటు చేసేందుకు కేసీఆర్ వేసిన పాచిక బాగా పని చేసింది. కేటీఆర్ ను జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచార సారధిగా నియమించి.. మీడియా ముందు కూడా హైలెట్ చేశారు. తెలుగు మీడియా సెంట్రల్ ఆఫీస్ లు అన్ని కూడా హైదరాబాద్ లోనే ఉండటం వల్ల హైదరాబాద్ ఎన్నికల మీద ఎక్కువ దృష్టిపెట్టడంలో అందులో కేటీఆర్ ప్రతి కదలికను కవర్ చెయ్యడం ద్వారా ఎక్కువ హైలెట్ చేశారు. మొత్తానికి తాను ఏం చెయ్యాలనుకున్నారో సైలెంట్ గా చేసిన కేసీఆర్ ఇప్పుడు మాత్రం కొంత మంది విమర్శకులు చేస్తున్న విమర్శల నుండి తప్పించుకోవడానికి హరష్ రావుకు మరో శాఖను అప్పగించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తానికి కేటీఆర్ స్వామి కార్యాన్ని.. స్వకార్యాన్ని పక్కా ప్రణాళికతో నిర్వహించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KTR  Harish Rao  TRS  KCR  GHMC  GHMC Elections  Narayankhed Elections  CM KCR  TRS party  Harish Rao Vs KTR  

Other Articles