Shah Rukh Khan's Car Attacked In Ahmedabad

Shah rukh khan s car attacked in ahmedabad

Shah Rukh Khan, Attack on Shah rukh Khan car, Ahmedebad, Intolerance

Bollywood superstar Shah Rukh Khan’s car was attacked early morning, on Sunday while he was shooting for his upcoming movie Raees in Ahmedabad. The attackers allegedly chanted slogans like 'Jai Shree Ram' and 'Shah Rukh Khan Hai Hai' while attacking the car. ANI reported that unidentified people pelted the car with stones. However, the actor was not present in the car at that time.

షారుక్ ఖాన్ కారు మీద రాళ్ల దాడి

Posted: 02/15/2016 08:41 AM IST
Shah rukh khan s car attacked in ahmedabad

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కారు మీద గుర్తు తెలియన వ్యక్తులు రాళ్లతో దాడికి దిగారు. అహ్మదాబాద్ లోని ఓ హోటల్ పార్కింగ్ లో ఉన్న షారుక్ ఖాన్ కారు మీద దాడి చేశారు. కొందరు గుర్తు తెలియన వ్యక్తులు జై శ్రీరాం, షారుక్ ఖాన్ డౌన్ డౌన్ అంటూ ఆయన కారు మీద రాళ్ల దాడికి దిగారు. కాగా దాడికి పాల్పడ్డ వారిని పట్టుకునేందుకు హోటల్ సెక్యూరిటీ ప్రయత్నించినా కానీ వాళ్లు పారిపోయారు. కాగా గతంలో షారుక్ చేసిన అసహనం వ్యాఖ్యల మీద మండిపడుతూ.. కొంత మంది ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.

త్వరలో విడుదల కానున్న రాయిస్ చిత్రం కొద్దిరోజులుగా గుజరాత్ రాష్ట్రంలో చిత్రీకరణ జరుపుకొంటున్నది. దేశంలో అసహనం పేరుకుపోయిందని గతంలో షారుక్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా వివాదాన్ని రేపాయి. ఆ తర్వాత షారుక్ నటించిన చిత్రం దిల్‌వాలే చిత్ర ప్రదర్శనను నిలిపివేయాలంటూ రాజస్థాన్, గుజరాత్ రాష్ర్టాల్లో వీహెచ్‌పీ, ఆర్‌ఎస్‌ఎస్‌లకు చెందిన కార్యకర్తలు ఆందోళన కార్యక్రమాలను చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే గతనెల భుజ్ ప్రాంతంలో రాయిస్ చిత్ర షూటింగ్‌ను కొందరు విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు అడ్డుకొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shah Rukh Khan  Attack on Shah rukh Khan car  Ahmedebad  Intolerance  

Other Articles