Congress leader Anand Sharma attacked at JNU, student union blames ABVP

Jnu row anand sharma says he was attacked physically by abvp activists

JNU Students Union, JNU Students' Protest, Jawaharlal Nehru University, Attack on Anand Sharma, Anand Sharma, former Union Cabinet Minister, ABVP

JNU Students Union, JNU Students' Protest, Jawaharlal Nehru University, Attack on Anand Sharma, Anand Sharma, former Union Cabinet Minister, ABVP

మాజీ కేంద్రమంత్రి ఆనంద్ శర్మపై దాడిని త్రీవంగా ఖండించిన కాంగ్రెస్

Posted: 02/14/2016 10:46 AM IST
Jnu row anand sharma says he was attacked physically by abvp activists

జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీలో విద్యార్థి సంఘాల మధ్య రాజుకున్న వివాదం కస్తా.. రాజకీయ నాయకులపై దాడులకు కేంద్రంగా మారుతున్నాయి. విశ్వవిద్యాలయంలో పలు విద్యార్థి సంఘాల మధ్య నెలకొన్న భేధాభిప్రాయాలతో వివాదాస్పందంగా మారగా.. ఒక వర్గం విద్యార్థి సంఘానికి మద్దతును ప్రకటిస్తూ.. అక్కడికి వెళ్లిన కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మకు పరాభవం ఎదురైంది. ఆయనపై ఏబివిపీకి అనుకూల విద్యార్తి సంఘం నేతలు దాడులకు పాల్పడ్డారు.

అయితే ఆనంద్ శర్మపై జరిగిన దాడిని కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. బీజేపీ విద్యార్థి విభాగం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)కి చెందిన గూండాలు ఆయనపై దాడి చేశారని పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జేవాలా ఆరోపించారు. "భారత ప్రజాస్వామ్యానికి ఇది చీకటి రోజు. రాజ్యసభలో విపక్ష ఉప నేత ఆనంద్ శర్మపై బహిరంగ దాడి జరిగింది. ఆయనపై ఏబీవీపీ గూండాలు పదునైన ఆయుధాలతో దాడి చేశారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం" అని ఆయన అన్నారు. కాగా, వర్శిటీ విద్యార్థుల అరెస్టు తరువాత జరుగుతున్న నిరసనలకు సంఘీభావం తెలిపేందుకు ఆనంద్ శర్మ వెళ్లిన సమయంలో దాడి జరిగిన సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anand Sharma  JNU campus  Rahul Gandhi  Afzal Guru  ABVP activists  

Other Articles