TRS triumphs in Greater Hyderabad civic polls

Trs triumphs in greater hyderabad civic polls

TRS, TRS Party, GHMC, GHMC Polls, GHMC election

The Telangana Rashtra Samithi triumphed in its maiden contest in the Greater Hyderabad Municipal Corporation (GHMC) elections, literally sweeping the polls with a victory in 100-plus seats out of the 150 divisions in the City. The Telangana Bhavan, TRS headquarters, wore a festive look with several leaders greeting one another and smearing gulal. TRS leader K Chandrashekar Rao celebrates the win in Hyderabad Civic Polls.TRS leader K Chandrasekar Rao celebrates the win in Hyderabad Civic Polls.

జంట నగరాల ప్రజలకు దన్యవాదాలు: కేసీఆర్

Posted: 02/05/2016 08:12 PM IST
Trs triumphs in greater hyderabad civic polls

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ చరిత్ర తిరగరాసిందని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు. గతంలో ఏ పార్టీ కూడా ఇవ్వనన్ని స్థానాలు ఇచ్చి అద్భుత విజయాన్ని అందించిన జంట నగరాల ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. శుక్రవారం తెలంగాణ భవన్లో కేసీఆర్ ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఈ సందర్భంగా గ్రేటర్ ఎన్నికల్లో గెలిచిన టీఆర్ఎస్ అభ్యర్థులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. జీహెచ్ఎంసీ అయిన తర్వాత గత చరిత్రలో ఏ పార్టీకి 52 స్థానాలకు మించి రాలేదన్నారు.

హైదరాబాదీలంతా తమ బిడ్డలేనని సీఎం కేసీఆర్ అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో విజయం అనంతరం సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను అందరూ పిడికిలెత్తి గెలిపించారు. వారందరికీ ధన్యవాదాలు. హైదరాబాద్‌లో ఉన్న వారంతా హైదరాబాదీలే.. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళతో పాటు ఆంధ్రా ప్రాంత సోదరులకు గొప్ప సదుపాయాలు కల్పిస్తాం. వీరందరికి రక్షణ కల్పిస్తామని ఉద్ఘాటించారు. ఏ ఒక్కరు అభద్రత భావానికి లోను కాకూడదని చెప్పారు. జంట నగరాల ప్రజలకు అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని పేర్కొన్నారు.

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో జర్నలిస్టు మిత్రులు మాకే ఓటేశారు అని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో విజయం ఏ ఒక్కరి వల్లనో కాలేదు. అందరి కృషి వల్లే విజయం సాధ్యమైంది. మొన్న నేను చెప్పినట్లు జర్నలిస్టులు తమకు ఓటేశారు. విజయంలో జర్నలిస్టుల పాత్ర కూడా ఉందన్నారు. అందరికీ ధన్యవాదాలు తెలిపారు సీఎం.

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీకి వంద సీట్లు వస్తే చెవి కోసుకుంటానన్న సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యలను సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నారాయణ తనకు దగ్గరి స్నేహితుడు. మనకు ఒక చెవి నారాయణ వద్దు. రెండు చెవుల నారాయణ కావాలి. ఆయన చెవుల వద్దకు ఏవరూ పోవద్దు. ఇలాంటి వ్యాఖ్యలు స్పోర్టివ్‌గా తీసుకోవాలని నారాయణ చెప్పినట్లు ఎలక్ట్రానిక్ మీడియాలో విన్నాను. నేను కూడా నారాయణ వ్యాఖ్యలను స్పోర్టివ్‌గా తీసుకుంటున్నానని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TRS  TRS Party  GHMC  GHMC Polls  GHMC election  

Other Articles