What Revanth Reddy speak after TRS record win in GHMC

What revanth reddy speak after trs record win in ghmc

TRS, GHMC, elections, KCR, KTR, revanth Reddy

What Revanth Reddy speak after TRS record win in GHMC. Revanth Reddy said that he took the challenge from KTR side

ITEMVIDEOS: తొడగొట్టిన రేవంత్ రెడ్డి ఏమన్నాడో తెలుసా.?

Posted: 02/05/2016 07:42 PM IST
What revanth reddy speak after trs record win in ghmc

టిఆర్ఎస్ పార్టీ గెలుపు మీద తెలుగదేశం పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బీరాలు పలికారు. కేటీఆర్ మీద తొడగొట్టారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి వచ్చే మెజార్టీ మీద సవాల్ విసిరారు. అయితే అందరికి దిమ్మ తిరిగే ఫలితాలు రావడంతో టిడిపితో సహా అన్ని పక్షాలకు షాక్ తగిలింది. గ్రేటర్‌లో టీఆర్‌ఎస్‌కు 100 సీట్లు వస్తే రాజకీయం నుంచి తప్పుకుంటానని రేవంత్‌రెడ్డి సవాల్ విసిరిన విషయం తెలిసిందే. అధికార పార్టీపైనా, సీఎం కేసీఆర్, మంత్రులపై నిరాధారమైన ఆరోపణలు, నోటికొచ్చినట్లు మాట్లాడి ప్రజల మెప్పు పొందాలని ప్రయత్నించిన రేవంత్ రెడ్డికి, ఆయన పార్టీ తెలుగుదేశానికి హైదరాబాద్ మహానగర ప్రజలు బుద్ది చెప్పారు. టీడీపీ-బీజేపీ కూటమి తోపాటు కాంగ్రెస్ పార్టీని ప్రజలు పాతాళంలో పాతిపెట్టారు. గులాబీ పార్టీకి భ్రహ్మరథం పట్టారు. సీఎం కేసీఆర్ పరిపాలనకు హైదరాబాద్ ప్రజలు పట్టంగట్టారు. 100 సీట్లకు పైగా మునిసిపల్ కార్పొరేషన్ డివిజన్లలో టీఆర్‌ఎస్ పార్టీకి ఓట్లేసి గెలపించారు.

రేవంత్ రెడ్డి ప్రస్తుతం మాట మార్చాడు. తాను సవాల్ విసరలేదని. ముందుగా కేటీఆర్ సవాలు విసిరాడని.. దానికి తాను ప్రతిసవాల్ మాత్రమే విసిరానని అన్నారు. అయితే ఫలితాలల్లో ఓట్ల శాతం మారినంత మాత్రాన పార్టీల విశ్వాసం తగ్గుతుంది అని కాదు అని రేవంత్ రెడ్డి అన్నారు. మొత్తానికి హైదరాబాద్ ప్రజలు టిఆర్ఎస్ కు మేయర్ పదవిని కట్టబెట్టాలని నిర్ణయించుకున్నట్లు మాత్రం తెలుస్తోందని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TRS  GHMC  elections  KCR  KTR  revanth Reddy  

Other Articles