Osama bin Laden got 9/11 terror attacks idea from EgyptAir crash

Osama bin laden got 9 11 terror attacks idea from egyptair crash

Twin towers, 9/11 attack, America, Bin Laden, EgyptAir crash

Osama bin Laden got inspiration for the deadly 9/11 attacks from a 1999 plane crash in which an Egyptian airline pilot deliberately downed his plane in the Atlantic Ocean, the al-Qaeda has claimed.

ట్విన్ టవర్స్ కూల్చడానికి అదే కారణం

Posted: 02/04/2016 12:52 PM IST
Osama bin laden got 9 11 terror attacks idea from egyptair crash

ప్రపంచాన్నే భయాందోళనలకు గురి చేసిన ట్విన్ టవర్స్ దాడికి స్ఫూర్తినిచ్చిన సంఘటన వెలుగులోకి వచ్చింది. వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై దాడి చేయడం ఒసామా బిన్ లాడెన్ సొంత ఆలోచన కాదని, ట్విన్ టవర్ల కూల్చివేతకు రెండు సంవత్సరాల ముందే జరిగిన ఓ సంఘటన నుంచి స్ఫూర్తి పొందాడని ఉగ్రవాద సంస్థకు చెందిన 'ఆల్‌మస్రా' పత్రిక వెల్లడించింది. ప్రపంచాన్నే గడగడలాడించిన ఉగ్ర దాడి సెప్టెంబర్‌ 11 ట్విన్‌ టవర్స్‌ కూల్చివేత. అయితే 217 మంది మృతికి కారణమైన ఈజిప్టు ఎయిర్‌లైన్స్ ప్రమాదం నుంచే లాడెన్‌ స్ఫూర్తి పొంది అమెరికాలో ట్విన్‌ టవర్స్‌పై దాడులు చేశాడని సంచలన కథనం ఒకటి వెలుగు చూసింది.

సెప్టెంబర్‌ 11 దాడులకు సరిగ్గా రెండేళ్ల ముందే ఈజిప్టు ఎయిర్ ఫ్లైట్ 990 విమానం అట్లాంటిక్ మహా సముద్రంలో కూలిపోయింది. ఈ విమానం లాస్‌ఏంజల్స్ నుంచి కైరోకు ప్రయాణిస్తూ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో మొత్తం 217 మంది జల సమాధి అయ్యారు. వీరిలో దాదాపు సగం మంది అమెరికాకు చెందినవారే ఉన్నారు. అయితే ఈ ప్రమాదం ఇంజన్ ఫెయిల్ కావటం వల్ల జరగిందని ఈజిప్టు విచారణాధికారులు తేల్చారు. కానీ, యూఎస్ నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డు మాత్రం ఎయిర్‌ ఫ్లైట్ 990 కో పైలెట్ 'జమీల్ ఆల్ బటౌటి' ఉద్దేశ పూర్వకంగానే విమానాన్ని నీటిలోకి దించాడని నిర్ధారించింది. కానీ, ఈ సంఘటన నుంచి ఆల్‌ఖైదా నాయకుడు లాడెన్ స్ఫూర్తి పొంది, దీని నుంచే వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ను కూల్చివేయాలనే గట్టిగా భావించారు. అయితే ఈజిప్ట్ విమానం వార్త 'ఆల్ మస్రా'లో వచ్చినప్పుడు దాన్ని చదువుతూ ఆవేశంతో ... విమానాన్ని నీటిలోకి ఎందుకు దించాడు.. భవనాన్ని ఎందుకు ఢీకొట్టలేదని లాడెన్ అన్నాడని సన్నిహితులు పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Twin towers  9/11 attack  America  Bin Laden  EgyptAir crash  

Other Articles