AP BC Caste | Kapu against | Collectorate | Keshana Shankar rao | news

Bcs to approach collectorate against kapu agitation

BCs to approach Collectorate, against Kapu agitation, Kapu agitation, BCs to approach Collectorate, bc caste leaders strike, AP BCs Against to kapu, BCs Against to kapu, Kapu latest updates, BC Caste leaders attack

BCs to approach Collectorate, against Kapu agitation: BCs, who are unwilling to include Kapus in in OBC, are getting ready to approach Collectorate, to fight against Kapus.

కాపులకు వ్యతిరేకంగా రేపు కలెక్టర్ల ముట్టడి

Posted: 02/03/2016 10:45 AM IST
Bcs to approach collectorate against kapu agitation

కాపులను బీసీ జాబితాలో కలపాలంటూ గతకొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో రచ్చ రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందుకోసం ఇప్పటికే రైలు, పోలీస్ స్టేషన్ లను కాల్చేసి నానా హంగామా సృష్టించారు కాపులు. అసలే అగ్గిమీద గుగ్గిలంలా వీరు తమ కాపులను బీసీ జాబితాలో కలపాలంటూ మండిపడుతుంటే... లేదు లేదు కాపులను మా బీసీ జాబితాల్లో ఎలా కలుపుతారంటూ బిసీ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.

ఇక వాళ్లు అలా దాడి చేస్తుంటే బిసీ సంఘాలు కలెక్టర్ల ముట్టడి చేయడానికి సిద్ధమయ్యారు. కాపులను బీసీ జాబితాలో కలపాలన్న డిమాండ్‌ను వ్యతిరేకిస్తూ రేపు ఏపీలోని 13 జిల్లాల కలెక్టరేట్లను ముట్టడించాలని 8 బీసీ సంఘాలు నిర్ణయించాయి. విజయవాడ, రాజమండ్రి, ఏలూరులలో లక్షలాది మందితో బహిరంగ సభలు నిర్వహించి, బీసీల సత్తా ఏంటో చాటుతామని ప్రకటించాయి.

జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ... అన్ని పార్టీలు రాజకీయ లబ్ధి కోసం కాపులను బీసీ జాబితాలో కలపాలని కోరడం అభ్యంతరకరమన్నారు. టీడీపీ, కాంగ్రెస్, వైఎస్సార్‌సీపీలు వాస్తవాలు తెలుసుకోకుండా కాపుల పక్షాన నిలిచి, బీసీలకు అన్యాయం చేయాలని కుట్ర పన్నుతున్నాయన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టుతో పాటు బీసీ కమీషన్లు ఏదైనా కులాన్ని బీసీ జాబితాలో చేర్చేందుకు కొన్ని నిబంధనలు విధించాయని, కానీ ఈ వాస్తవాలను గమనించకుండా అధికారం ఉందని టీడీపీ ప్రభుత్వం, ఆ పార్టీకి పోటీగా ఇతర పార్టీలు కాపుల పక్షాన నిలిచి బీసీలకు అన్యాయం చేస్తున్నారని అన్నారు.


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP BC Caste  Kapu against  Collectorate  Keshana Shankar rao  news  

Other Articles