Tension in Old city and masab tank

Tension in old city and masab tank

MIM, Old City, BJP, Congress, Masab Tank

Some MIM and congress, BJP leaders fight at polling stations. Police enterd into polling stations and controlled them.

పాతబస్తీలో, మాసబ్ ట్యాంక్ పోలింగ్ కేంద్రాల్లో ఉద్రిక్తత

Posted: 02/02/2016 03:09 PM IST
Tension in old city and masab tank

గ్రేటర్ ఎన్నికల పోలింగ్ చాలా నెమ్మదిగా సాగుతోంది. గతంలో కన్నా ఎక్కువగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కానీ పెద్దగా ప్రయోజనాలు కనిపిచడం లేదు. మధ్యాహ్నం 12 గంటల వరకు కేవలం 22 శాతం మాత్రమే ఓటు శాతం నమోదైంది. కాగా పాతబస్తీలొ కాస్త ఉద్రిక్తత నెలకొంది. పాతబస్తీలో ఎంఐఎం పార్టీ కార్యకర్తలకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య వివాదం ముదిరి.. పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తతకు దారి తీసింది. అయితే అధికారులు కలగజేసుకొని.. ఇరువర్గాలను పోలింగ్ కేంద్రం దగ్గరి నుండి పంపించివేశారు.


మాసాబ్ ట్యాంక్ లోనూ ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎంఐం కార్యకర్తలు రిగ్గింగ్ కు పాల్పడుతున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు రెండు వర్గాలను అక్కడికి నుంచి చెదరగొట్టారు. దాంతో కొద్దిసేపటి తర్వాత పోలింగ్ కేంద్రం వద్ద ప్రశాంతత ఏర్పడింది. బంజారాహిల్స్‌లో కేకే కుమార్తె, డివిజన్ అభ్యర్థి విజయలక్ష్మి పోలీసుల తీరుపై మండిపడ్డారు. చార్మినార్ ఎమ్మెల్యే పాషా ఖాద్రీని పోలీసులు అరెస్ట్ చేశారు. సోమాజీగూడలో కాంగ్రెస్ అభ్యర్థి భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి చిన్న ఘటనలు తప్పితే జీహెచ్ఎంసీ ఎన్నికలు ప్రశాంతంగానే కొనసాగుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MIM  Old City  BJP  Congress  Masab Tank  

Other Articles