KTR wife got shock from elections commission

Ktr wife got shock from elections commission

KTR, KTR Wife, TRS, GHMC, Polls

Telangana minister KTR wife did not get any voter slips from election commission. KTR wife dont have vote in GHMC voter list

కేటీఆర్ భార్యకు ఎలక్షన్ కమీషన్ షాక్

Posted: 02/02/2016 10:47 AM IST
Ktr wife got shock from elections commission

తెలంగాణ ఐటీ, పంచాయతీ రాజ్ శాఖల మంత్రి కేటీఆర్ గ్రేటర్ ఎన్నికల పోలింగ్ లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో వెంకటేశ్వర కాలనీలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో ఆయన ఓటేశారు. కాగా ఆయన భార్య శైలిమకు అసలు ఓటే లేదని అధికారులు చెబుతున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఆమెకు ఓటు లేదని ఎన్నికల సిబ్బంది చెబుతున్నారు. ఆమె స్వగ్రామంలో కూడా ఓటు హక్కు లేదని తెలుస్తోంది.అటు టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ జూబ్లీహిల్స్ లోని పోలింగ్ బూత్ లో ఓటు వేశారు. మరోవైపు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు.

బీజేపీ సీనియర్ నేత, కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ రామ్ నగర్ లో ని పోలింగ్ బూత్ లో ఓటు వేశారు. కుటుంబసభ్యులతో కలిసి వచ్చిన దత్తన్న.. ఓటు హక్కు వినియోగించుకున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 7లో కాంగ్రెస్ నేత, ఎంపీ కేవీపీ రామచంద్రరావు, కాచిగూడలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్సీ ఎన్.రామచందర్ రావు, కేకే కూతురు విజయలక్ష్మి తదితరులు ఓటేశారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమై పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 5గంటల వరకు కొనసాగుతుంది. 26వేల మంది పోలీసులు బందోస్తులో ఉన్నారు. 3వేల మందితో పోలింగ్ ప్రక్రియను వెబ క్యాస్టింగ్ చేస్తున్నారు.

కాగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ మందకొడిగా కొనసాగుతోంది. తొలి మూడు గంటల్లో పది శాతం ఓటింగ్ కూడా కాలేదు. ఈ ఉదయం 7 గంటల సమయంలో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ప్రారంభం కాగా, పోలింగ్ మందకొడిగా సాగుతోంది. దాదాపు అన్ని డివిజన్లలోని పోలింగ్ బూత్ ల వద్ద ఓటేసేందుకు వస్తున్న ప్రజల సంఖ్య స్వల్పంగానే ఉన్నట్టు తెలుస్తోంది. కొన్ని చోట్ల బూత్ లు ఖాళీగా కూడా కనిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KTR  KTR Wife  TRS  GHMC  Polls  

Other Articles