Pawan Kalyan said that Movement must like Telangana Movement

Pawan kalyan said that movement must like telangana movement

Pawan Kalyan, janasena, Pawan Kalyan on Kapu, Pawan Kalyan on kapu Protest, pawan Kalyan about Telangana movement, kapu movement

Pawan kalyan spoke about the kapu movement for their reservations. Pawan kalyan said that movement must like telangana movement. Movement must have plan.

ఉద్యమాన్ని తెలంగాణ ఉద్యమంలా నడపాలి: పవన్ కళ్యాణ్

Posted: 02/01/2016 05:26 PM IST
Pawan kalyan said that movement must like telangana movement

కాపు రిజర్వేషన్ల మీద ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో సాగుతున్న ఆందోళన మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ.. కాపు సామాజిక వర్గానికి చెందిన వారు తూర్పుగోదావరి జిల్లా తునిలో ఏర్పాటు చేసుకున్న కాపు గర్జన హింసాత్మకంగా మారింది. అయితే గర్జన కాస్తా హింసాత్మకంగా మారడం మీద పవన్ కళ్యాణ్ స్పందించారు. ఉద్యమాన్ని నడిపించే నాయకుడు ఎప్పుడూ కూడా ఆవేశాలను రెచ్చగొట్టే విధంగా ఉండకూడదు అని కోరారు.

ఎమోషన్స్ తో ఉద్యమ నాయకులు ఆడుకోకూడదు అని.. ఉద్యమం అంటే తెలంగాణ ఉద్యమంలా సాగాలని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ముందుగా అన్ని పార్టీలు, అన్ని సంఘాలు కలిసి, జేఏసీగా ఏర్పాడ్డాయని తెలిపారు. అలా జేఏసీగా ఏర్పడిన తర్వాత ఉద్యమ కార్యాచరణ అనుకొని దాన్ని అందరూ పాటించారని గుర్తు చేశారు. అలా ముందుగా ప్లాన్ ప్రకారం ఉద్యమం నడిస్తే బాగుంటుందని పవన్ అభిప్రాయపడ్డారు.

రైలు దహనం వెనుక అసాంఘిక శక్తులు: పవన్

రైలు దహనం వెనుక అసాంఘిక శక్తులు: పవన్రైలు దహనం వెనుక అసాంఘిక శక్తులు: పవన్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles