Collector offer Biryani for cleaning lake

Collector offer biryani for cleaning lake

Collector, Kozhikode, Kozhikode Collector, Pisharikavu lake, Prasanth Nair, Kerala

no mortal can say 'no' to a plate of beautifully cooked, aromatic biryani. Playing on this weakness for an environmental cause, a district collector, Prasanth Nair from Kerala posted a Facebook status inviting people of Koyilandy in Kozhikode to gather together and clean the polluted Pisharikavu lake. In exchange, the Kozhikode district collector offered the volunteers a treat of delectable Kozhikode biryani, a spicy Malabar specialty.

చెత్త అంతుచూడు... బిర్యానీ రుచిచూడు

Posted: 01/28/2016 01:14 PM IST
Collector offer biryani for cleaning lake

ఐడియా మీ జీవితాన్ని మారుస్తుంది అన్న యాడ్ చూశాం.. కానీ కేరళలో ఓ జిల్లా కలెక్టర్ ఐడియా ఛేంజ్ ఎవ్రి ధింగ్ అనేలా ఉంది. అంతలా అద్భుతమైన ఐడియా ఆ కలెక్టర్ ఏమిచ్చారు అనుకుంటున్నారా..? అదేదో పనికి ఆహార పథకం అన్నట్లు పని చెయ్యండి.. బిర్యానీ కుమ్మేయండి అంటూ బంపర్ ఆఫర్ ఇచ్చారు. కోజికోడ్ జిల్లా కలెక్టర్ ఎన్. ప్రశాంత్ నాయర్ కొల్లాం చిరా చెరువులోని చెత్తను తొలగించే పనిలో సాయం చేసిన వారికి రుచికరమైన కేరళ బిర్యానీ పెడతానంటూ ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టాడు. దీనికి భారీ ఎత్తున స్పందన రావడమే కాకుండా దాదాపు నాలుగు గంటల పాటు ఆ చెరువులోకి దిగి చిన్నా, పెద్దా, అధికారి, కూలీ అనే వ్యత్యాసం లేకుండా తలా ఓ చేయి వేసి ఆ చెరువుకు కొత్త కళ తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో స్వయంగా కలెక్టర్ కూడా తన బూట్లు గట్టు మీదే వదిలిపెట్టి, చెరువులోకి దిగి చెత్తను శుభ్రం చేశారు.

ఆ తర్వాత మొదలైంది అసలు సందడి. అప్పటి వరకు చెరువులో చెత్తా చెదారాన్ని ఏరిన కలెక్టర్ ఆ వెంటనే గరిటె పట్టలు. వంటలు చేశారు. ఘుమఘుమలాడే బిర్యానీ చేయించి స్వయంగా ఆయనే వేడి వేడిగా భోజనం ప్లేట్లలో వడ్డించారు. వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. కేవలం పరిపాలనా అంశాల్లోనే కాకుండా సామాజిక స్పృహ కలిగి ఉన్న ప్రశాంత్ నాయర్ ఒక పనికి సంబంధించి ప్రజలను చైతన్యం వంతం చేసి దాన్ని పూర్తి చేయించగలిగారు. ఇదే ప్రశాంత్ కున్న ప్రత్యేక లక్షణం. అంతేకాదు, 'కంపాషినేట్ కోజికోడ్' అనే సంస్థనొకదాన్ని స్థాపించి దాని ద్వారా పలు సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ బిర్యానీ ఐడియా అదిరింది కదూ..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Collector  Kozhikode  Kozhikode Collector  Pisharikavu lake  Prasanth Nair  Kerala  

Other Articles