JAC calls varsity bandh onj Rohith Suicide

Jac calls varsity bandh onj rohith suicide

bandh, jac, osmania university, protest, Rohith Vemula, suicide, university of hyderabad

The Osmania University JAC has announced a bandh of all state universities in Telangana on Wednesday in support of the countrywide bandh declared by the Joint Action Committee for Social Justice which is leading the protest in University of Hyderabad on the issue of suicide by Rohith Vemula.

రోహిత్ ఆత్మహత్యపై యూనివర్సిటీల బంద్

Posted: 01/27/2016 11:19 AM IST
Jac calls varsity bandh onj rohith suicide

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్  ఆత్మహత్యపై ఆందోళనలు కొనసాగుతున్నాయి.  రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఇవాళ ఆల్ ఇండియా వర్సిటీల బంద్ కు పిలుపునిచ్చింది నేషనల్  స్టూడెంట్ జేఏసీ. విద్యార్థులు స్వచ్ఛందంగా క్లాసులను బహిష్కరించాలని కోరింది.  మరోవైపు వారం రోజుల పాటు వరుసగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది స్టూడెంట్స్ జేఏసీ. రేపు, ఎల్లుండి ర్యాలీలు, ధర్నాలు, దిష్టిబొమ్మల దహనం చేపట్టాలని నిర్ణయించింది. 30న రోహిత్ పుట్టిన రోజు సందర్భంగా హెచ్.సి.యులో భారీ సభ ఏర్పాటు చేయనున్నారు. ఇక ఫిబ్రవరి మొదటి వారంలో ఢిల్లీలో పెద్దఎత్తున నిరసనకు ప్లాన్ చేశారు. ఫస్ట్ వీక్ లోనే చలో ఢిల్లీ నిర్వహించి జంతర్ మంతర్ లో ఆందోళన చేస్తామన్నారు స్టూడెంట్స్ . మరోవైపు రోహిత్ మృతికి కారణమైన నేతలపై చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామన్నారు.  

మరో పక్క యూనివర్సిటీలో విద్యార్థుల నిరవధిక దీక్ష నాలుగో రోజుకు చేరుకుంది. హెచ్.సి.యు విద్యార్థుల ఉద్యమానికి పార్టీలు, ప్రజాసంఘాలు మద్దతుగా నిలుస్తున్నాయి. హెచ్.సి.యుకు వెళ్లి విద్యార్థుల దీక్షకు మద్దతు ప్రకటించారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. రోహిత్ కుటుంబానికి పార్టీ తరఫున ఐదు లక్షల సాయం ప్రకటించారు.  హెచ్.సి.యు విద్యార్థుల దీక్షకు మద్దతుగా.. ట్యాంక్ బండ్ అంబేడ్కర్ విగ్రహం దగ్గర దీక్ష చేపట్టేందుకు ప్రయత్నించారు. ఓయూ విద్యార్థి జేఏసీ, ప్రజాసంఘాల నేతలు. రోహిత్ ఆత్మహత్యకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇన్ చార్జి వీసీ నియామకాన్ని తప్పుపట్టారు. సెక్రటేరియట్ ముట్టడికి ప్రయత్నించారు ఏఐఎస్ఎఫ్ నేతలు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినా..దత్తాత్రేయను అరెస్ట్ చేయకపోవటంపై ఫైరయ్యారు. రోహిత్ మృతిపై సీఎం కేసీఆర్ వెంటనే స్పందించాలన్నారు. హెచ్.సి.యులో దీక్ష చేపట్టిన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి రోజురోజుకు విషమిస్తోంది. మరోవైపు ఆల్ ఇండియా వర్సిటీల బంద్ పిలుపుతో యూనివర్సిటీల్లో టెన్షన్ కొనసాగుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bandh  jac  osmania university  protest  Rohith Vemula  suicide  university of hyderabad  

Other Articles