Telangana Minister KTR slams PM Modi.

Telangana minister ktr slams pm modi

KTR, Modi, BJP, GHMC, GHMC Elections

KTR once more slams BJP And Modi with his words. He said that Modi is greater than Foreign Minister and less than Prime Minister.

మోదీ విదేశాంగ శాఖకు ఎక్కువ.. ప్రధాని పదవికి తక్కువ

Posted: 01/26/2016 05:03 PM IST
Telangana minister ktr slams pm modi

తెలంగాణ మంత్రి కేటీఆర్ మాటల గారడీ గురించి అందరికి తెలుసు. తెలుగుదేశం పార్టీని, కాంగ్రెస్ పార్టీని, భారతీయ జనతా పార్టీలను తన మాటలతో ఏకిపారేస్తున్నారు. అయితే తాజాగా ఓ అడుగు ముందుకు వేసి భారత ప్రధాని నరేంద్ర మోదీ మీద విరుచుకుపడ్డారు. జిహెచ్ఎంసీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కేటీఆర్ తన మాటలకు మరింత పదును పెడుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశాంగ శాఖకు ఎక్కువ...ప్రధాని పదవికి తక్కువ అంటూ తెలంగాణ మంత్రి కె. తారక రామారావు విమర్శించారు.

అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ ప్రభుత్వం ఏం చేసిందో గంట సేపు ఆగకుండా చెబుతానని అన్నారు. మరి కేంద్రం ఏం చేసిందో కిషన్‌రెడ్డి చెబుతారా? అంటూ కేటీఆర్ సవాల్ చేశారు. టీటీడీపీ నేత రేవంత్‌, కాంగ్రెస్ నేత షబ్బీర్‌అలీ ముచ్చట తీర్చే బాధ్యత మీరే తీసుకోవాలని ఆయన అన్నారు. హైదరాబాద్‌ను గత ప్రభుత్వాలు అభివృద్ధి చేస్తే నీటి సమస్య ఎందుకుందని ఆయన సూటిగా ప్రశ్నించారు. అన్ని పార్టీల కార్యాలయాలకు తాళాలు పడ్డాయని, ఏ సమస్య లేకుండా ముందుకెళ్తున్న పార్టీ టీఆర్‌ఎస్‌ ఒక్కటేనని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KTR  Modi  BJP  GHMC  GHMC Elections  

Other Articles