ap ruling and oppositon parties giving credits to one another

Ys jagan targets chandrababu naidu on rohit suicide

Bandaru Dattatreya, Dalit student, Dalit scholar suicide, Chandra Babu, YS jagan, HRD Minister, Hyderabad Central University (HCU), P Appa Rao, Dalit professors, Rohith Vemula, Smriti Irani, suicide, Vice Chancellor

netzens react on ys jagan remarks at hyderabad central university, says both the parties are giving credits to one another

చంద్రబాబుకు ఆ క్రెడిట్ అంటగడుతున్న జగన్

Posted: 01/21/2016 04:31 PM IST
Ys jagan targets chandrababu naidu on rohit suicide

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో అధికార టీడీపీ ఏకైక ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఒకదానికోకటి క్రెడిట్ అంటగట్టే పనిలో వున్నాయి. సమైక్య ఉద్యమం నాటి కేసులో వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి బాస్కర్ రెడ్డిని అరెస్టు కావడంతో సమైక్య ఉద్యమ క్రెడిట్ నంతా చెవిరెడ్డికీ, ఆయన పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దక్కినట్లు అయ్యింది. దీంతో తమకు చెవిరెడ్డి చంద్రబాబుపై, ఆయన ప్రభుత్వంపై రుసరుసలాడారు. అధికారంలోని టీడీపీ ప్రభుత్వం సమైక్య ఉద్యమ కేసులన్నింటీనీ ఎత్తివేస్తామని ప్రకటించి.. కేవలం వైసీపీ నేతలను మాత్రమే టార్గెట్ చేసుకుని అరెస్టులు చేయిస్తుందని అరోపించారు.

అయితే నీవు నేర్పిన విద్యే నీరజాక్షా అంటూ.. హైదరబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యపై దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు కదులివచ్చి.. భాధితుడి కుటుంబాన్ని పరామర్శించడం జరిగాయి. విద్యార్థులు చేస్తున్న అమరణ దీక్షకు సంఘీభావం కూడా ప్రకటించాయి. అయితే బాధితులు తెలుగు రాష్ట్రాలకు చెందిన వాడని, అందులోనూ గుంటూరు వాసియని తెలిసి కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రోహిత్ కుటుంబాన్ని పరామర్శించకపోవడాన్ని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ తూర్పారబట్టారు.

సోషల్ మీడియాలో వైసీపీ చేస్తున్న ప్రచారంలో భాగంగా రోహిత్ ఆత్మహత్యను ప్రస్తావిస్తూ చంద్రబాబుపై విమర్శలకు దిగింది. “సెంట్రల్ యూనివర్సిటీలో పాలకుల పాపం… విద్యార్ధుల్ని దేశద్రోహులుగా చిత్రిస్తారా… దళిత విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నా చంద్రబాబుకి పట్టదా… కుల వివక్షను పెంచిపోషిస్తున్నారా…” అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును టార్గెట్ చేసుకుని వైసీపీ ప్రచారం చేస్తోంది. అసలు జగన్ పార్టీ తెరలేపిన ఈ ప్రచారానికి ఒక అర్ధముందా? అంటూ సోషల్ మీడియా వేదికగా జగన్ పార్టీ తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు.

అయితే జగన్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి వెళ్లి.. రోహిత్ ను పరామర్శించి వచ్చినా.. ఆ క్రెడిట్ ను మాత్రం టీడీపీకి అంటగట్టారు. అదెలా అంటే.. హెచ్ సీ యూ కు వెళ్లి చంద్రబాబుపై జగన్ విమర్శలు చేయగా, ఏఫీ మంత్రలు రావెల కిషోర్ బాబు, పితల సుజాతలు మాత్రం రోహిత్ వేముల తల్లిని పరామర్శించి.. తమ ప్రభుత్వం తరపున ఐదు లక్షల రూపాయల సాయాన్ని అందించారు. జగన్ విమర్శించినందు వల్లే మంత్రలు వెళ్లి రోహిత్ కుటుంబాని పరామర్శించారని, అంటే జగన్ వర్సటీకి వెళ్లి చేసిందంతా హరి.. అన్నట్లుగా మారిందని కూడా నెట్ జనులు కామెంట్లు గుప్పిస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rohith Vemula  Hyderabad Central University (HCU)  Chandra Babu  YS jagan  

Other Articles