Nightmare to fairytale as toddler is run over and survives

Cctv shows miraculous escape of 3 yr old

miraculous escape of 3 yr old, CCTV shows miraculous escape of 3 yr old, lucky, little, girl, survived, crash, fall, CCTV, footage, Delhi, missing, cctv footage, toddler, miraculous escape, delhi

Tense CCTV footage from Delhi shows the toddler tottering towards a dirt road before she trips with moments later a car drives over her miraculously missing her with its wheels.

ITEMVIDEOS: ఈ చిన్నారి నిజంగానే అదృష్టవంతురాలు..

Posted: 01/21/2016 03:04 PM IST
Cctv shows miraculous escape of 3 yr old

ఔరా..! ఈ చిన్నారి అదృష్టాన్ని చూసిన వారు ఎవరైనా.. ఈ చిన్నారి అదృష్టవంతురాలేనంటారు. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని, కాలం కలసివస్తే.. పాము కూడా తాడగా మారుతుందన్న నానుడులు నిజమంటున్నారు మరికోందరు. ఏం జరుగుతుందో తెలయదు. కానీ జరగకూడనిది జరిగిపోయింది. అయినా ఆ ప్రమాదం నుంచి సురక్షితంగా భయటపడిన ఈ చిన్నారి అదృష్టవంతురాలేనని అంటున్నారు పలువురు. సీసీటీవీ ఫూటేజ్ ఈ మొత్తం వ్యవహారాన్ని రికార్డు చేయడం, దానిని ఇవాళ పరిశీలించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

దేశ రాజధాని ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా వున్నాయి. ఇంట్లో మందులు వేస్తున్న క్రమంలో తనకు ఆ మందులు వద్దని ఇంట్లోంచి బయటకు వెళ్లిన మూడేళ్ల చిన్నారి.. ఏకంగా రోడ్డుపైకి వచ్చింది. రోడ్డులో వున్న గొతిలో కాలు పెట్టడంతో అదుపు తప్పి పడిపోయింది. అయితే అనూహ్యంగా జరిగిన ఘటనతో కొద్ది సేపు అలానే రోడ్డుపైనే పడుకుండిపోయింది. అదే సమయంలో అటుగా వస్తున్న సిల్వర్ కలర్ వాగన్ ఆర్ కారు చిన్నారిపై నుండి వెళ్లింది. అరె చిన్నారికేమైనా అయ్యిందా అనుకునే లోపు కారు వెళ్లిపోవడం ఆ తరువాత పాప లేచి నిలబడింది.  ఈ ఘటనను చూసిన పలువురు పాప చేరదీసి వారింట్లో దిగబెట్టి తల్లికి విషయం తెలిపారు. ఈ ఘటనను చెప్పడం కన్నా చూస్తేనే బాగుంటుంది.. ఆలస్యమెందుకు మీరు చూసేయండీ..

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cctv footage  toddler  miraculous escape  delhi  

Other Articles