India, Manohar Parrikar behind university terror attack

India manohar parrikar behind university terror attack

Pakistan, India, Terror Attack on University in Pak, Manohar Parrikar

Former Pakistan Interior Minister Rehman Malik has blamed India for the terror attack on Bacha Khan University in Charsadda, northwestern Khyber Pakhtunkhwa province today. The Pakistani Taliban first took the responsibility for the attack in which 25 people were killed but later denied its involvement. "We should not take the threat of India's defense ministry lightly. Indian agency R&AW is behind the attack on Bacha Khan University. They have reached at an understanding with Tehrik-e-Taliban," Malik told a news channel.

పాకిస్థాన్ లో ఉగ్రవాదుల దాడి వెనుక భారత్..?

Posted: 01/21/2016 11:17 AM IST
India manohar parrikar behind university terror attack

పాకిస్థాన్ లో నిన్న ఉగ్రవాదులు మరోసారి తమ పైశాచికత్వాన్ని ప్రదర్శించారు. ఉగ్రవాదులు ఉన్నపలంగా విద్యార్థులను పిట్టలను కాల్చినట్లు కాల్చివేయడం సంచలనం రేపింది. అయితే ఈ ఘటనలో దాదాపు 20 మంది విద్యార్థులు అక్కడిక్కడే బుల్లెట్లకు కూలిపోయారు. కాగా పాకిస్థాన్ పెంచిపోషిస్తున్న ఉగ్రవాద భూతమే ఆ విద్యార్థులను బలతీసుకుందని అందరికి తెలుసు. కానీ పాకిస్థాన్ మాజీ అంతర్గత వ్యవమారాల మంత్రి గారు చేసిన ప్రకటన అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. దాడులకు తాము బాధ్యలలమని తెహ్రీక్-ఎ-తాలిబన్ ప్రకటిస్తే.. మంత్రిగారు మాత్రం ఈ దాడి వెనుక బారత్ హస్తం ఉంది ప్రకటించేశారు.

దాడి వెనుక భారత్ హస్తముందని ప్రకటించిన పాకిస్థాన్ మాజీ అంతర్గత వ్యవమారాల మంత్రిదాడి వెనుక భారత రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ కుట్ర దాగుందని పేర్కొని కలకలం రేపారు. తాలిబాన్లతో లోపాయికారీ ఒప్పందం చేసుకున్న భారత్ ఈ దాడికి పథక రచన చేసిందని కూడా ఆయన ఆరోపించారు. మరోహర్ పారికర్ కనుసన్నల్లో నడుస్తున్న భారత గూఢచార సంస్థ ‘రీసెర్చి అండ్ అనాలసిస్ వింగ్ (రా)’ ఈ దాడికి రూపకల్పన చేసిందని మాలిక్ వ్యాఖ్యానించారు.

ఎప్పుడైతే చర్చలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ముందడుగు వేశారో, దానిని నిలువరించేందుకు ‘రా’ అధికారులు ఈ దాడులకు తెర తీశారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రవాదుల దాడి  తర్వాత ఇక ఎంతమాత్రం సహనంతో ఉండేది లేదన్న పారికర్, పాక్ కూడా ఈ తరహా అనుభవాలను అనుభవించాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. పాకికర్ వ్యాఖ్యలను ప్రస్తావించిన మాలిక్... ఆ తరహా ఘాటు వ్యాఖ్యలు చేయడానికి పారికర్ కు ఎంత ధైర్యమంటూ కూడా ఊగిపోయారు. అయినా పాకిస్థాన్ లో దాడికి బారత్ కారణం అంటే పాకిస్థాన్ వాళ్లు కూడా నమ్మరని పాపం మంత్రిగారికి అర్థంకావడం లేదా..?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pakistan  India  Terror Attack on University in Pak  Manohar Parrikar  

Other Articles