Facebooks Mark Zuckerberg Is Not A Good Neighbor

Facebooks mark zuckerberg is not a good neighbor

facebook, markzukenberg, Nighbours, Parking

Facebook founder Mark Zuckerberg doesn’t appear to be making any new friends in his San Francisco Mission District neighborhood. Zuckerberg’s neighbors on Liberty Hill near Dolores Park are circulating a letter griping about the social-media titan’s security detail hogging up “desirable parking spots.”

ఫేస్ బుక్ ఓనర్ వల్ల వాళ్లకు తలనొప్పి

Posted: 01/20/2016 09:01 AM IST
Facebooks mark zuckerberg is not a good neighbor

పక్కింటి వాళ్లు అంటేనే దాయాదుల్లా ఉంటారని అనుకుంటే తప్పు. అసలు మ్యాటర్ ఏంటి అంటే ఫేస్ బుక్ ఓనర్ ఇరుగు పొరుగు వాళ్లకు ఇబ్బంది కలిగేలా వ్యవహరిస్తున్నారట. అందుకే వారికి జుకెన్క బర్గ్ మీద కోపంగా ఉన్నారట. అతి పెద్ద కార్లను ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేసి కాలనీవాసులకు తీవ్ర ఇబ్బందులు కలగచేస్తున్నారంటూ వారు రాసిన ఓ లేఖ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాంగ్ పార్కింగ్ తో తెచ్చిపెడుతున్న సమస్యను నగర రవాణా ఏజెన్సీకి, జుకర్ బర్గ్ ఇంటి భద్రతా మేనేజర్ టిప్ వెన్జెల్ కు ఫిర్యాదు చేశారు.

ఇక ఆయన లగ్జరీ హోమ్ కు చాలా కాలంగా జరుగుతున్న రినోవేషన్ పనులు కూడా కాలనీవాసులకు తలనొప్పిగా మారిందట. జుకర్ బర్గ్ చాలాకాలంపాటు తమ ఇంటి నిర్మాణం కొనసాగించడంతో తీవ్రమైన శబ్దం, చెత్తతోపాటు, వీధుల్లో స్థలాన్ని ఆక్రమించడం తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సమస్యకు పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని వారంతా కోరుతున్నారు. ఈ సమస్యపై జుకర్ బర్గ్ ఎలా స్పందిస్తారో మరి?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : facebook  markzukenberg  Nighbours  Parking  

Other Articles