Telengana BJP spokesman faces protests in HCU

Telengana bjp spokesman faces protests in hcu

HCU, Rohith, Suicide in HCU, Hyderabad Central University, Students attack in HCU

A group of students, who have been demanding the removal of Union Ministers Smriti Irani and Bandaru Dattatreya and the Vice Chancellor, rushed to Reddy's car and raised slogans against the ministers and his party. Telangana BJP spokesperson Prakash Reddy on Tuesday faced the wrath of agitating students of the Hyderabad Central University(HCU) while he was leaving the campus after participating in a TV debate.

టెన్షన్: HCUలో దాడి.. కారు అద్దాలు ధ్వంసం

Posted: 01/20/2016 08:07 AM IST
Telengana bjp spokesman faces protests in hcu

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న టెన్షన్ వాతావరణం ఏర్పడింది. రోహిత్ ఆత్మహత్య నేపధ్యంలో అక్కడ పరిస్థితి అంతకంతకు దిగజారుతోంది. విద్యార్థి సంఘాలు ఇప్పటికే రోహిత్ ఆత్మహత్య మీద ఉడికిపోతున్నాయి. తాజాగా హెచ్.సి.యులో ఆందోళనలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. కాగా తాజాగా యూనివర్సిటి చేరుకున్న బీజేపీ నాయకుడికి నిరసన సెగ తగిలింది. యూనివర్సీటికి చేరుకున్న బీజేపీ నేత ప్రకాశ్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. ఆయన వాహనాన్ని క్యాంపస్ లోకి రానివ్వకుండా విద్యార్థులు అడ్డుకున్నారు. కారును చుట్టుముట్టి అద్దాలు పగులగొట్టారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

యూనివర్సిటీలో హింసాత్మక ఘటనలకు అవకాశం ఉంది. రోహిత్ ఆత్మహత్య మీద అట్టుడుకుతున్న యూనివర్సిటీలో ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయి. దిల్లీలో, హైదరాబాద్ లో విద్యార్థులు చేస్తున్న నిరసన కార్యక్రమాలకు రాజకీయ రంగు అంటుకుంటోంది. కేంద్రమంత్రి దత్తాత్రేయ లేఖ రాయడం వల్లే రోహిత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడనే ఆరోపణలు రావడంతో ఆయన ఇంటిని ముట్టడించేందుకు తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం యత్నించింది. పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రోహిత్ ఆత్మహత్య కేసులో.. తెలంగాణ సర్కారు నుంచి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందింది. ఈ కేసులో తెలంగాణ పోలీసులు తీసుకున్న చర్యలను నివేదికలో వివరించింది. రోహిత్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తైందని, ఆ నివేదిక కోసం ఎదురు చూస్తున్నట్లు వెల్లడించింది. కేంద్రమంత్రి దత్తాత్రేయ, వర్శిటీ వైస్ ఛాన్సలర్ పైనా కేసులు నమోదైనట్లు నివేదికలో పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : HCU  Rohith  Suicide in HCU  Hyderabad Central University  Students attack in HCU  

Other Articles