Microsoft Selfie App for iOS Updated With New Features and Interface

Microsoft selfie app for ios updated with new features and interface

microsoft, Selfie, Selfie app

The Microsoft Selfie app that was introduced last month for iOS has now been updated with a new logo, new UI, and some new features as well. The Microsoft Selfie v2.0.0 besides a new UI and logo, introduces a 'Share' feature using which you can send the selfie images clicked to others, something that was missing earlier. The version also fixes a bug that led the app to crash when the device is in airplane mode. Users can also rate the app by going in to the Settings page.

మైక్రోసాఫ్ట్ యాప్ తో అదిరే సెల్ఫీలు

Posted: 01/19/2016 03:29 PM IST
Microsoft selfie app for ios updated with new features and interface

ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా అందరికి సెల్ఫీ పిచ్చిపట్టుకుంది. సెల్ఫీ లేకుండా ఎవరూ కూడా ఉండలేని పరిస్థితి. అయితే గత నెలలో మైక్రోసాఫ్ట్ ఐఓఎస్ యూజర్ల కోసం సెల్ఫీ యాప్ ను విడుదల చేయగా... తాజగా దానికి మరిన్ని హంగులు అద్దింది. 'మైక్రోసాఫ్ట్ సెల్ఫీ 2.0 వెర్షన్‌'లో యూజర్లు తాము తీసుకున్న ఫొటోలను క్షణాల్లోనే షేర్ చేసుకునే సదుపాయం కల్పించారు. ఇంతకు ముందు వెర్షన్‌లో ఇది లేదు. అదేవిధంగా కలర్ బ్యాలెన్స్, స్కిన్, లైటింగ్ వంటి సెట్టింగ్స్‌ను ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ చేస్తూ ఫొటోలను తీసుకునే విధంగా నూతన వెర్షన్‌ను తీర్చిదిద్దారు. డివైస్ కెమెరా ముందు ఉన్న వ్యక్తుల ఆకృతి, ఇతర హావభావాలకు అనుగుణంగా ఈ యాప్ ద్వారా సెల్ఫీలను తీసుకునే వీలు కల్పించారు.

యూజర్లు తాము తీసుకున్న ఫొటోలను మరింత ఆకర్షణీయంగా కనిపించేలా తయారు చేసుకునేందుకు దాదాపు 13 రకాలకు పైగా ఫిల్టర్లను ఇందులో అందిస్తున్నారు. ఈ యాప్‌కు చెందిన కొత్త అప్‌డేట్‌ను ప్రస్తుతం ఐఓఎస్ యూజర్లు యాపిల్ యాప్‌స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాగా ఈ యాప్‌కు చెందిన ఆండ్రాయిడ్ వెర్షన్‌ను మైక్రోసాఫ్ట్ త్వరలోనే వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానుంది. మరి మీరు కూడా మైక్రోసాఫ్ట్ కొత్త యాప్ తో అదిరిపోయే సెల్ఫీలు దిగండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : microsoft  Selfie  Selfie app  

Other Articles