New angel in HCU student rohith suicide

New angel in hcu student rohith suicide

Rohith, HCU, Hyderabad Central University, Suicide, Rohith Suicide

Hyderabad central University student union leader Rohith suicide case got new turn. Clashes between rohith and ABVP Student before his suicide.

రోహిత్ ఆత్మహత్యకు ముందు హిందుత్వ వివాదం

Posted: 01/19/2016 03:06 PM IST
New angel in hcu student rohith suicide

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటిలో రోహిత్ అనే దళిత నాయకుడి ఆత్మహత్య తీవ్ర సంచలనాన్ని రేపింది. దళిత విద్యార్థి నాయకుడి ఆత్మహత్యకు కావాలనే కొంత మంది కుట్ర పన్నారని.. కొంత మంది చేసిన హత్య ఇది అంటూ రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ లో జరిగిన ఆత్మహత్య మీద దిల్లీలో మంటలు అంటుకున్నాయి. కేంద్ర మానవ వనరుల మంత్రి స్ర్మతి ఇరానీ కార్యాలయం ముందు దిల్లీ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థి సంఘం నాయకులు ధర్నా నిర్వహించారు. ఆ విద్యార్థి ఆత్మహత్యకు పరోక్షంగా స్ర్ముతి ఇరానీ కారణం అంటూ నినాదాలు చేశారు. అయితే ఈ కేసులో కేంద్ర మంత్రి దత్తాత్రేయ మీద, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ అప్పారావు మీద కూడా కేసులు నమోదయ్యాయి.

దేశవ్యాప్తంగా కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఘటన మీద చర్చించుకుంటున్నాయి. అయితే అన్ని మీడియా సంస్థల్లో కూడా ఏబీవీపీ నాయకుల వల్ల, కేంద్ర మంత్రుల లేఖల వల్ల రోహిత్ ఆత్మహత్యకు పాల్పడినట్లు రకరకాల కథనాలను ప్రసారం చేస్తున్నాయి. అయితే రోహిత్ ఆత్మహత్యకు ముందు తీసిన ఓ వీడియో అసలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏం జరిగిందో అన్న విషయాన్ని అద్దంపడుతుంది. సెంట్రల్ యూనివర్సిటీలో రాజకీయాలు, కుల పిచ్చి ఏ లెవల్ లో ఉందో అర్థమవుతుంది.

రోహిత్ దళిత విద్యార్థి సంఘానికి నాయకుడిగా వ్యవహరిస్తున్నాడు. అయితే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దళిత సంఘాలకు, ఏబీవీపీ సంఘానికి అస్సలు పొసగదు. అందుకే ప్రతి విషయంలో గొడవలు జరుగుతుంటాయి. అయితే ఏబీవీపీ కార్యకర్తలు కట్టిన ఓ బ్యానర్ ను రోహిత్ చించడం మీద తాజాగా ఓ వీడియో విడుదలైంది. ఆ వీడియోలో రోహిత్ ఏబీవీపీ ఫ్లెక్సీని చించినట్లు తెలుస్తోంది. అయితే దీని మీద నిలదీసిన ఏబీవీపీ కార్యకర్తలు నిలదీస్తే.. అతడు చాలా నిర్లక్షంగా సమాధానమివ్వడం కనిపిస్తుంది. తనకు కాషాయం రంగు అంటే నచ్చదని.. నచ్చనందుకే తాను ఫ్లెక్సీని చించినట్లు కనిపించింది. ఏబీవీపీ కార్యకర్తలు కోపంతో ఊగిపోయినా కానీ ఏమాత్రం పట్టించుకోని రోహిత్ నిర్లక్షపు సమాధానాలు వీడియో కనిపిస్తున్నాయి.

మరి వీడియో ఆధారంగా చూస్తే.. రోహిత్ వైపు కూడా తప్పు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగని రోహిత్ దే తప్పు అని కాదు ఉద్దేశం. సెంట్రల్ యూనివర్సిటీలో రాజకీయాలు ఏ మేరకు ఉన్నాయి అన్న దానికి వీడియోనే సాక్ష్యం. అయితే మీడియాలో ఈ ఒక్క సాయింట్ ను మాత్రం ఎందుకు హైలెట్ గా చూపించడం లేదో అర్థం కావడం లేదు. ఎందుకంటే రోహిత్ ఆత్మహత్య ఉదంతం చిలికిచిలికి గాలి వానగా మారింది. దాంతో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఏఐసీసీ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ, మాయావతిలాంటి నాయకులు దీని మీద స్పందిస్తుండటం... తెలుగు మీడియా ఒక్కటే కాకుండా నేషనల్ మీడియా కూడా దీని మీద దృష్టిసారిస్తోంది. మరి అలాంటప్పుడు మీడియా ఎంతో పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.

దిల్లీ వేదికగా జరిగిన నిరసనలో భాగంగా రోహిత్ ఆత్మహత్య మీద నినాదాలు చేసిన విద్యార్థులు పనిలో పనిగా మోదీకి వ్యతిరేకంగా కూడా నినాదాలు చేశారు. మరికొంత మంది రోహిత్ ది కాషాయ హత్య అంటూ బిజెపి, ఏబీవీపీ నాయకులు చేసిన హత్య అన్నట్లు స్టేట్ మెంట్స్ ఇచ్చేశారు. అయినా ఇక్కడ జరిగింది ఆత్మహత్య... రోహిత్ ఆత్మహత్యకు ముందు అసలు ఏం జరిగింది అన్న దాని మీద పూర్తిగా వివరాలు తెలియకుండా అటు నాయకులు, విద్యార్థులు చివరకు మీడియా కూడా కథనాలు ప్రసారం చేస్తుండటం విశేషం. రోహిత్ కుటుంబ సభ్యలు రోధన ఎవరూ తీర్చలేనిది. ఎదిగివచ్చిన కొడుకు కనిపించని లోకాలకు వెళ్లిపోతే కలిగి గుండె కోత ఎవరూ తట్టుకోలేనిది. అయితే రోహిత్ ఆత్మహత్య వెనుక రాజకీయాలు ఉన్నాయి అన్నది క్లీయర్. కానీ అతడి ఆత్మహత్య మీద వస్తున్న వార్తల్లో కూడా రాజకీయం చేస్తుండటం ఏం బాగోలేదు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rohith  HCU  Hyderabad Central University  Suicide  Rohith Suicide  

Other Articles