టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మునుపెన్నడూ లేని విధంగా ఆధ్యాత్మిక చింతన, పండుగలు, శుభకార్యాలకు సమయాన్ని కేటాయిస్తూ వస్తున్నారు. గతంలో గొప్ప పరిపాలనాధ్యక్షుడిగా పేరు కోసం తాపత్రయపడి.. ఆ మేరకు కీర్తిగడించిన ఆయన మనవడు పుట్టిన వేళావిశేషమేమోగాని మొత్తంగా గుడులు, గోపురాలకు, పండుగలు, పబ్బాలకు కుటుంబసభ్యులతో కలసి పాల్గొంటున్నారు. తాజాగా సంక్రాంతి పండగను పురస్కరించుకుని చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని తన సొంతూరు నారావారిపల్లెలో పండగ సంబరాలలో పాల్గొన్నారు.
పండగలో పాల్గోనేందుకు నిన్న రాత్రికే నారావారిపల్లెకు చేరుకున్న చంద్రబాబు మన సంప్రదాయబద్దమైన బంగారువర్ణపు జెరితో కూడిన తెల్లటి పంచను ధరించి స్థానికులను ఆశ్చర్యచకితులను చేశారు. పంచలోనే తన ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆయన తన కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, స్నేహితులతో కలసి హుషారుగా సంక్రాంతి సంబరాల్లో పాల్గోన్నారు. కాగా ఈ వేడుకలలో పాల్గోనేందుకు చంద్రబాబు కుటుంబం మొత్తం నారావారిపల్లెకు చేరుకుంది.
ఇక చంద్రబాబు బావమరిది, హిందూపురం ఎమ్మెల్యే, టాలీవుడ్ అగ్రనటుడు నందమూరి బాలకృష్ణ కూడా మొన్ననే నారావారిపల్లె చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితం బయటకు వచ్చిన చంద్రబాబుతో బాలయ్య కూడా గ్రామ వీధుల్లోకి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన పంచెకట్టుతో బయటకు వచ్చి అందరినీ ఆకట్టుకున్నారు. ఇక చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నేటి ఉదయం గ్రామంలోని నాగాలమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more