Munnabhai MBBS' actor vishal thakkar goes missing

Munnabhai mbbs actor goes missing

Vishal Thakkar goes missing, Munnabhai MBBS actor goes missing, Vishal Thakkar accused of raping girlfriend, Munnabhai MBBS' actor vishal thakkar,

Vishal Thakkur the’ Munna Bai M.B.B.S’ actor who was recently accused of rape by his girlfriend has gone missing.

అత్యాచార అభియోగాలు ఎదుర్కోన్న బాలీవుడ్ నటుడు అదృశ్యం

Posted: 01/13/2016 05:27 PM IST
Munnabhai mbbs actor goes missing

అత్యాచార అభియోగాలను ఎదుర్కోన్న బాలీవుడ్ నటుడు విశాల్ థక్కర్ గత కోన్ని రోజులుగా అదృశ్యమయ్యాడు. తనపై అత్యాచారం చేశాడని సహ నటి కేసు నమోదు చేయడంతో మనస్తాపానికి గురైన విశాల్ థక్కర్ జనవరి 1వ తేదీ నుంచి కనిపించకుండా పోయాడు. 2016 నూతన సంవత్సర వేడుకలను గర్ల్ ఫ్రెండ్ తో ఘనంగా జరుపుకున్న కొన్ని క్షణాల తర్వాత అతడు అకస్మాత్తుగా అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. రేప్ కేసు నుంచి బయటపడి ఊపిరిపీల్చుకుంటున్న తరుణంలో అదృశ్యం కావడంతో అతని తల్లిదండ్రులు విచారంలో మునిగిపోయారు.

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. అహ్మదాబాద్ లో ప్రియురాలు రజనీ రాథోడ్ తో పార్టీ చేసుకుని ముంబైకి తిరిగి వస్తూ అతడు కనిపించకుండాపోయాడు. అప్పటి నుంచి అతని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉంది. ఎవరో ఫ్రెండ్ ను కలవడానికని వెళ్లి అదృశ్యమైనట్టుగా తెలుస్తోందని విచారణ అధికారి జయవంత్ పాడ్వి తెలిపారు. అయితే అత్యాచార ఆరోపణల నేపథ్యంలో అతనికి అవకాశాలు బాగా తగ్గి పోవడంతో డిప్రెషన్ కు లోనయ్యాడని ప్రియురాలు రజని చెప్పిందని పోలీసులు తెలిపారు.

విశాల్ తల్లిదండ్రుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు అన్ని కోణాల్లో కేసులు దర్యాప్తు చేపట్టారు. మున్నాభాయ్ ఎంబీబీఎస్', 'టాంగో చార్లీ', 'చాందిని బార్' తదితర చిత్రాలతోపాటు, టీవీ సీరియల్స్ విశాల్ థక్కర్ నటించాడు. గత ఏడాది అక్టోబర్ లో సహ నటిపై అత్యాచారం చేశాడన్న ఆరోపణలను ఎదుర్కొన్నాడు. సహజీవనం చేసి పెళ్లికి నిరాకరిస్తున్నాడంటూ ఆమె కేసు పెట్టింది. అనంతరం ఇద్దరూ రాజీపడడంతో ఆమె కేసు ఉపసంహరించుకుంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Munnabhai MBBS' actor  vishal thakkar  missing  

Other Articles