Jammu and Kashmir Trouble in paradise for BJP

Jammu and kashmir trouble in paradise for bjp

Jammu, Kashmir, JK CM, Mufti, Mutfi Mohamood Sayed, Mufti Mehabooba, BJP, Congress, Sonia Gandhi

As suspense over formation of new government in Jammu and Kashmir continued, PDP leader Mehbooba Mufti was today visited by Congress President Sonia Gandhi and Union Minister Nitin Gadkari for mourning but the meetings were seen with political significance. The meetings took place even as BJP leader and former Deputy Chief Minister Nirmal Singh expressed confidence that the alliance with PDP will continue as he said the party has written to Governor N N Vohra saying it will have a discussion on whatever decision the the ally takes. Gandhi, who arrived from Delhi, drove straight from the airport to the Fairview residence of Mehbooba in Gupkar

జమ్ము కాశ్మీర్ లో రాజకీయ వేడి.. బిజెపికి గండం..?

Posted: 01/11/2016 10:15 AM IST
Jammu and kashmir trouble in paradise for bjp

జమ్ము కాశ్మీర్ లో సమీకరణలు మారుతున్నాయి. జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మెహ్మద్ సయిద్ మృతితో అక్కడ రాజకీయాలు వేడెక్కాయి.ముఫ్తీ మరణం తర్వాత ఆయన కూతురు మహబూబా అధికారాన్ని చేపడతారని ప్రచారం జరిగినా కానీ ఎలాంటి ప్రకటనా రాలేదు. అయితే గత గురువారం ముఫ్తీ మరణించిన తర్వాత మూడు నాలుగు రోజుల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. సోనియా.. మెహబూబాతో 20 నిమిషాలు ప్రత్యేక భేటీ కావడంతో.. బీజేపీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. జమ్మూ కాశ్మీర్ లో కొత్త సమీకరణాలు అంకురిస్తున్నాయి. పాత ఫ్రెండ్స్ మళ్లీ కలవబోతున్నారా అనే సంకేతాలు కనిపిస్తున్నాయి.జమ్ము కాశ్మీర్ పగ్గాలు చేపట్టేందుకు మెహబూబా ముఫ్తీ సిద్ధమైనా.. ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు. అయితే.. ఈ గ్యాప్ లో సోనియాగాంధీ శ్రీనగర్ వెళ్లి.. మెహబూబాను కలవడంతో కొత్త చర్చకు తెరలేచింది.

పీడీపీ - బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఈ రెండు పార్టీల మధ్య ఎక్కడా కో ఆపరేషన్ లేదు. ఒకరు ఒక రకమైన వ్యాఖ్యలు చేస్తే.. మరొకరు వాటిని ఖండిస్తూ.. ప్రభుత్వంలోనే రెండు పార్టీలు, రెండు గ్రూపులుగా ఉన్నాయి. అయితే.. తాజాగా సోనియా భేటీ కావడంతో.. పీడీపీ - కాంగ్రెస్ కూటమి గద్దెనెక్కేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా అనిపిస్తోంది. 2002 నుంచి 2008 వరకు పీడీపీ - కాంగ్రెస్ కలసి జమ్మూ కాశ్మీర్ లో ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. అయితే.. 2008లో వివిధ కారణాలతో ఆ పొత్తు చిత్తయింది. సోనియా రంగప్రవేశంతో ఆ పొత్తులు మళ్లీ చిగురిస్తాయా అనే అనుమానాలు వస్తున్నాయి. అయితే.. వాటిని ఖండిస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. సోనియా రాక వెనుక రాజకీయ ప్రమేయం లేదంటున్నారు. కేవలం సంతాపం తెలిపేందుకు వచ్చారని చెబుతున్నారు. మరో రెండు రోజుల్లో జమ్ము కాశ్మీర్ లో అసలు రాజకీయాలకు తెర పడుతుందని కొందరు అనుకుంటున్నారు. మరి చూడాలి పిడిపి బిజెపితోనే కొనసాగుతుందా లేదంటే పాత మిత్రపక్షం కాంగ్రెస్ తో జతకడుతుందా అన్న తేలాల్సింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jammu  Kashmir  JK CM  Mufti  Mutfi Mohamood Sayed  Mufti Mehabooba  BJP  Congress  Sonia Gandhi  

Other Articles