State elections commission wrote a letter to Pawan Kalyan

State elections commission wrote a letter to pawan kalyan

GHMC, GHMC elections, Pawan Kalyan, Pawn Kalyan Janasena, Janasena party

In That letter State Elections commission told that pick any election symbol from the chart and contest with that symbol in GHMC elections.

పవన్ కళ్యాణ్... జనసేనకు ఏ గుర్తు కావాలి..?

Posted: 01/11/2016 11:38 AM IST
State elections commission wrote a letter to pawan kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగు నాట ప్రజల కోసం జనసేన పార్టీని ప్రారంభించారు. అయితే గత ఎన్నికల్లో పార్టీ పోటీ చేయకుండా తెలుగుదేశం, బిజెపి కూటమికి బయటి నుండి మద్దతును ప్రకటించారు. అలాగే ఎన్నికల ప్రచారంలో పాలుపంచుకున్నారు. అయితే ఎన్నికల సంఘం వద్ద జనసేన పార్టీని రిజిస్ట్రేషన్ కూడా జరిగిపోయింది. అయితే తాజాగా తెలంగాణ ఎన్నికల సంఘం తరఫున జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు ఓ లేఖ అందింది. దాని అర్థం ఏంటి అంటే.. పవన్ కళ్యాణ్ గారి పార్టీకి ఎన్నికల సంఘం నిర్దేశించిన ఎన్నికల గుర్తులలో ఏదో ఒకదానికి ఎంచుకోవాలని.

తాజాగా హైదరాబాద్ లో జరుగుతున్న జిహచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ లేఖ రాసింది. .జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గుర్తింపు పొందిన పార్టీగా జనసేనకు నిబంధనల ప్రకారం నిర్దేశించిన గుర్తుల్లో ఏదో ఒక దానికి ఎంచుకోవాలని.. దాని మీద ఎన్నికల్లో పోటీ చెయ్యాలని రాష్ట్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. కాగా ఈ దఫా ఎన్నికల్లో నిలబడటం లేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కాగా తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కూటమి తరఫున ప్రచారం చెయ్యాల్సిందిగా ఆ పార్టీల నాయకులు కొరినట్లు తెలుస్తోంది. కానీ పవన్ మాత్రం అందుకు స్పందించలేదని తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : GHMC  GHMC elections  Pawan Kalyan  Pawn Kalyan Janasena  Janasena party  

Other Articles