ShutDownNDTV Goes Viral

Shutdownndtv goes viral

NDTV, ShutDownNDTV, Barkha Dutt, Shut Down anti-national NDTV

Television news channel NDTV faced the onslaught of Twitteratis, mainly sycophants of the Narendra Modi-government for allegedly spreading false, misleading news. The Modi bhakts lashed out at NDTV demanding the government to close down the news channel for adopting an ‘anti-national’ perspective. The hardline supporters of Bharatiya Janata Party (BJP) even raised online slogans of sending editor-in-chief Barkha Dutt to Pakistan.

ఎన్డీటీవీ మూసివెయ్యాలంట.. నెట్ లో హల్ చల్

Posted: 01/07/2016 03:12 PM IST
Shutdownndtv goes viral

దేశంలొని ప్రముఖ ఛానల్ ఎన్డీటీవీని మూసివెయ్యాలని డిమాండ్ కు నెటిజన్లు బ్రహ్మరథం పడుతున్నారు. యాష్ ట్యాగ్ షట్ డౌన్ ఎన్టీటీవీ అంటూ నెటిజన్లు తమ ఫీలింగ్స్ ను షేర్ చేస్తున్నారు. అయితే ఎన్డీటీవీకి కేవలం కొన్ని వర్గాలకు, కొన్ని అంశాలకు మాత్రమే ప్రాధాన్యతనిస్తోందని అంతే కానీ అన్ని అంశాలను సమాన ప్రాధాన్యతతో చూడటం లేదని మండిపడుతున్నారు. నెట్ లో దీని మీద పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఎన్డీటీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ బార్కా దత్ మీద కూడా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో దీని మీద తీవ్రంగా ప్రచారం జరుగుతోంది. మోదీ అభిమానులు, బిజెపి సపోర్టర్స్ దీని బాగా ప్రచారం చేస్తున్నారు.

మోదీ మీద, అలాగే దేశంలో జరిగిన కొన్ని ఘటనల మీద తప్పు ప్రచారం చేస్తోందని ఎన్డీటీవీ మీద నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగా షట్ డౌన్ ఎన్డీటీవీ అంటే యాంటీ నేషనల్ ఎన్డీటీవీ అంటూ ప్రచారం చేస్తున్నారు. మోదీ, షరీఫ్ మీటింగ్ మీద కూడా కొన్ని తప్పుడు కథనాలను ఎన్డీటీవీ ప్రసారం చేసింది. మోదీ, షరీఫ్ దాదాపు గంట పాటు ఏకాంతంగా మీటింగ్ జరిపినట్లు సార్క్ సమావేశాల సందర్భంగా కథనం ప్రసారం చేసింది. అయితే దీని మీద విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మండిపడింది. ఇలాీ గతంలో ఎన్నో సార్లు తప్పుడు కథనాలను ప్రసారం చెయ్యడం.. చిన్న అంశాలను మరీ ఫోకస్ చెయ్యడం.. కొన్ని అంశాలను అసలు పట్టించుకోకపోవడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. మరి చూడాలి ఈ ప్రాచరం ఎక్కడికి దారి తీస్తుందో..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NDTV  ShutDownNDTV  Barkha Dutt  Shut Down anti-national NDTV  

Other Articles