Social media reaction on Chris Gayle row

Social media reaction on chris gayle row

Chris Gayle, McLaughlin, journalist Mel McLaughlin, Chris Gayle row, Social Media on Chris Gayle

Gayle was speaking to journalist Mel McLaughlin during a Big Bash League match in Hobart on Monday and said the following: "To see your eyes for the first time is nice. Hopefully we can have a drink afterwards. Don't blush baby."

క్రిస్ గేల్ కు 10 వేల ఫైన్.. సోషల్ మీడియాలో గేల్ పై ఫైర్

Posted: 01/05/2016 06:48 PM IST
Social media reaction on chris gayle row

ఓ మహిళా టీవీ రిపోర్టర్‌తో అసభ్యకరంగా ప్రవర్తించడంపై  క్రిస్‌‌గేల్‌‌కు 10వేల ఆస్ట్రేలియన్ డాలర్ల జరిమానా విధించారు. నిన్న జరిగిన బిగ్ బాష్ లీగ్ ట్వంటీ20 మ్యాచ్ సందర్భంగా గేల్ ఓ మహిళా రిపోర్టర్‌తో అసభ్యంగా ప్రవర్తించడంతోపాటు ఆమెను అగౌరవపర్చేలా వ్యాఖ్యలు చేశారు.  'నీ కళ్లు అందంగా ఉన్నాయి. మ్యాచ్ అయిపోయిన తర్వాత మనం తాగేందుకు వెళ్దామా.. సిగ్గుపడకు బేబీ' అంటూ గేల్ చెప్పాడు. క్రిస్‌‌గేల్ మాటలకు కొంత ఇబ్బందిపడినా... తాను సిగ్గుపడడం లేదంటూ మెల్‌మెక్ లాఫ్లిన్‌ ఇంటర్వ్యూను కొనసాగించింది. కాగా, గేల్ మాటలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అంతేకాదు గేల్ వ్యాఖ్యలపై బిగ్ బాష్ లీగ్ ఆర్గనైజేషన్ (బీబీఎల్), ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తీవ్రంగా స్పందించాయి.

క్రిస్ గేల్ వ్యాఖ్యలు అవమానకరమైనవని బీబీఎల్ వ్యాఖ్యానించింది. క్రిస్ గేల్ వ్యాఖ్యలు చాలా తీవ్రమైనవని, వాటిని తాము జోక్‌గా తీసుకోవడం లేదని క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ మెక్‌గ్రాత్ స్పష్టం చేశారు. బిగ్ బాష్ సీఈఓ ఎవెర్డ్ సైతం గేల్ తీరు సరికాదని అన్నారు.  10 వేల ఆస్ట్రేలియన్ డాలర్ల(సుమారు 4 లక్షల 75 వేల రూపాయలు) జరిమానా వేశారు. ఈ మొత్తం రొమ్ము కేన్సర్ బాధితులకు సహాయం అందిస్తున్న మెక్ గ్రాత్ ఫౌండేషన్ కు వెళుతుందని క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) వెబ్ సైట్ వెల్లడించిందిదీంతో క్రిస్‌గేల్ మీడియాతో మాట్లాడుతూ జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేశాడు. ఆ మహిళ రిపోర్టర్‌కు క్షమాపణలు చెప్పాడు. ప్రజెంటర్ మెల్‌మెక్ లాఫ్లిన్‌ పట్ల తాను అవమానకర, అసభ్యకర వ్యాఖ్యలు చేయలేదని, ఒకవేళ ఆమె తన వ్యాఖ్యలకు బాధపడితే క్షమాపణలు చెబుతున్నానని చెప్పారు. తన వ్యాఖ్యలను జోక్‌గా తీసుకోవాలని, వాటిని సీరియస్‌గా తీసుకొవద్దని గేల్ పేర్కొన్నారు. నిరుడు కూడా కరీబియన్‌ లీగ్‌ సందర్భంగా ఓ మహిళా జర్నలిస్టుతో డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడి విమర్శల పాలయ్యాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles