This Kid Eating an Entire Watermelon at a Cricket Game

This kid eating an entire watermelon at a cricket game

Kid Eating an Entire Watermelon, Australia, youtube, youtube hero

Everyone, meet Watermelon Boy. Watermelon Boy, everyone. Watermelon Boy, you see, is a kid who was attending a cricket match in Melbourne, Australia, Saturday, when he was filmed in the stands consuming an entire watermelon, rind and all.

ITEMVIDEOS: పుచ్చకాయ తిన్న పిల్లోడు ఫేమస్.. 2016 హీరో

Posted: 01/05/2016 01:36 PM IST
This kid eating an entire watermelon at a cricket game

సోషల్ మీడియాలో పాపులర్ అవడానికి ఎంతో మంది ఏవేవో చేస్తుంటారు. కొంత మంది జిమ్మిక్కులు, మ్యాజిక్కులు చేస్తుంటే మరికొంత మంది చిత్ర విచిత్రాలు చేస్తుంటారు. అయితే ఓ చిన్న పిల్లోడు మాత్రం కేవలం ఓ పుచ్చకాయను తినడం వల్ల ఫేమస్ అయ్యాడు. ఏంటీ.. పుచ్చకాయ తిని ఎలా ఫేమస్ అయ్యాడు అని అనుకుంటున్నారా..? అయితే మొత్తం స్టోరీ చదవాల్సిందే. మెల్‌బోర్న్‌లోని ఓ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ ఆసక్తికరంగా జరుగుతోంది. ఈ మ్యాచ్‌కు చూడడానికి వచ్చిన మిచెల్ అనే 10 సంవత్సరాల బాలుడిని లైవ్ కెమెరా ఫోకస్ చేసింది. ఈ క్రమంలోనే మిచెల్ చేస్తున్న చిలిపి పని కెమెరాకు చిక్కింది. స్క్రీన్‌పై కనిపించడంతో అందరూ అతని వంకే చూశారు. పుచ్చకాయను తోలుతో సహా లాగించేస్తూ మనోడు అందరి దృష్టిని ఆకర్షించాడు. పచ్చని పుచ్చకాయను మిచెల్ పరపరా నమిలి తినేస్తుండడంతో అందరూ పగలబడి నవ్వుకున్నారు.

పుచ్చకాయను ఇలా కూడా తినొచ్చా అని సెటైర్లు వేశారు. అంతేకాదండోయ్, మరుసటి రోజు ఈ వీడియో యూట్యూబ్‌లో హల్‌చల్ చేసింది. ఈ సంవత్సరంలో అత్యంత హిట్స్ కొట్టిన వీడియోగా రికార్డు సృష్టించింది. అతడిని ‘ఫస్ట్ ఇంటర్‌నెట్ హీరో 2016’ గా పీపుల్స్ మ్యాగ్‌జైన్ అభివర్ణించింది. అయితే ఈ విషయంపై మిచెల్ మాట్లాడుతూ ‘ఐ యామ్ నాట్ ఏ నార్మల్ హీరో, ఐ యామ్ జస్ట్ ఏ కిడ్’ అని నవ్వుతూ చెప్పాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kid Eating an Entire Watermelon  Australia  youtube  youtube hero  

Other Articles