Gang attacks hotel owner for cigarette

Gang attacks hotel owner for cigarette

Gang, Attack on Hotel Owner, Cigarette

A youth gang attacked on a hotle owner for Cigarettes in Hyderabad. By the CC Camara visuals police filed acase on that incident and searching for them.

ITEMVIDEOS: సిగరెట్ తాగొద్దు అంటే కొట్టేశారు

Posted: 01/05/2016 04:04 PM IST
Gang attacks hotel owner for cigarette

సిగరెట్లు తాగొద్దు బాబూ అని అన్నందుకు హోటల్ యజమాని మీద దాడి చేశారు ఓ ఆకతాయి ముఠా. హైదరాబాద్ మహానగరంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో హోటల్ యజమానికి గాయాలు కాగా. హోటల్ లో ఏర్పాటు చేసిన సిసి కెమెరాల్లో మొత్తం వ్యవహారం రికార్డ్ అయింది. పాపం మంచి మాటలు చెప్పిన పాపానికి హోటల్ యజమాని మీద దాడి చెయ్యడం ఎంత మాత్రం కరెక్ట్. సిసి కెమెరాల పుటేజ్ ల ఆధారంగా పోలీసులు ఆ ఆకతాయి ముఠా కోసం వెతుకుతున్నారు. అయినా సిగరెట్లు తాగవద్దంటే కొట్టేస్తారా అనుకుంటున్నారా..? అయితే మొత్తం స్టోరీ మీ కోసం..

హోటల్ లో సిగరెట్ తాగొద్దు అన్న పాపానికి.. హోటల్ యజమానిపైనే యువకులు దాడికి దిగిన ఘటన.. హైదరాబాద్ ఉప్పల్ లో చోటుచేసుకుంది. ఈ నెల 1న ఉప్పల్ బస్ డిపో ఎదురుగా ఉన్న ముస్తాఫా బిర్యాని హౌజ్ హోటల్ కు కొందరు యువకులు వచ్చారు. సిగరెట్ తాగడానికి ప్రయత్నించడంతో యజమాని సయ్యద్ హసన్ వారిని వారించాడు. దీంతో రెచ్చిపోయిన యువకులు సయ్యద్ పై దాడికి దిగారు. సయ్యద్ తో పాటు హోటల్ సిబ్బందిని కూడా విచక్షణారహితంగా కొట్టారు. బాధితులు మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా.. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gang  Attack on Hotel Owner  Cigarette  

Other Articles