Nation Pays Tribute To Pathankot Martyrs Lieutenant Colonel Niranjan Kumar

Nation pays tribute to pathankot martyrs lieutenant colonel niranjan kumar

Nation, India, Niranjan, Pathankot, Lieutenant Colonel Niranjan Kumar, Bengalaru

Lieutenant Colonel Niranjan Kumar's body will today be taken from Bengalaru to his home town Palakkad in Kerala, where last rites are expected to be performed tomorrow morning for the NSG commando who was martyred in Pathankot on Sunday.

ITEMVIDEOS: ఆ వీరుడికి కన్నీటి వీడ్కోలు

Posted: 01/04/2016 04:14 PM IST
Nation pays tribute to pathankot martyrs lieutenant colonel niranjan kumar

పఠాన్ కోట్ ఎయిర్ బేస్ లో... ముష్కరులను అంతమొందించే క్రమంలో అమరుడైన లెఫ్టినెంట్ కల్నల్ నిరంజన్ అంత్యక్రియలు ముగిశాయి. సైనిక లాంఛనాలతో లెఫ్టినెంట్ కల్నల్ నిరంజన్ అంత్యక్రియలు జరిగాయి. ఈ ఉదయం కుటుంబీకులకు నిరంజన్ పార్థివదేహం అప్పగించారు భద్రతా దళాధికారులు. దీంతో ఆ కుటుంబంతో బంధువులు, స్థానికులు విషణ్ణ వదనంలో మునిగిపోయారు. ముష్కరులతో పోరులో వీర మరణం పొందిన... నిరంజన్ భౌతికకాయానికి బంధువులు, స్నేహితులు అశ్రునయనాలతో నివాళులర్పించారు. దేశ భద్రత కోసం ప్రాణాలు అర్పించిన వీరుడిని స్థానికులు సందర్శించి అంజలి ఘటించారు. కర్నాటక సీఎం సిద్దరామయ్య... నిరంజన్ పార్థివదేహానికి నివాళులర్పించారు.

పఠాన్ కోట్ ఎయిర్ బేస్ లో ఉగ్రవాదుల దాడిలో వీరమరణం పొందిన కమాండో... గురుసేవక్ సింగ్ భౌతికకాయానికి అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు ముగిశాయి. హర్యానాలోని గర్నాలకు చెందిన కమాండో గురుసేవక్ సింగ్ ఉగ్రవాదుల తూటాలకు అమరుడయ్యాడు. అమర సైనికుడి పార్థివదేహాన్ని ఈ ఉదయం గర్నాలలోని స్వగ్రామానికి తరలించారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. అశ్రునయానాల మధ్య కుటుంబీకులు, బంధువులు, స్థానికులు తుది వీడ్కోలు పలికారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nation  India  Niranjan  Pathankot  Lieutenant Colonel Niranjan Kumar  Bengalaru  

Other Articles