Chris Gayle controversial statements with a journalist

Chris gayle controversial statements with a journalist

Chris Gayle, Journalist, Chris gayle in an interview, Chris Gayle updates

Chris Gayle has told a media conference that his remarks toward female journalist Mel McLaughlin during Monday night’s Big Bash League game were “just a joke” that had been taken out of proportion, but walked off when told the interview had made her uncomfortable .

ITEMVIDEOS: క్రిస్ గేల్ బూతు కామెంట్లు..

Posted: 01/05/2016 09:30 AM IST
Chris gayle controversial statements with a journalist

అతడో లెజెండ్.. అతడి ఆటంటే పడిచచ్చే అభిమానులు చాలా మంది ఉంటారు. అతడు బ్యాట్ తో చెలరేగితే గ్రౌండ్ లో ప్రత్యర్థుల గుండెలు జారి పోవాలి. కానీ అలాంటి ఓ క్రికెటర్ మహిళా రిపోర్టర్ తో అసభ్యంగా ప్రవర్తించారు. బిగ్‌బాష్ లీగ్‌లో గేల్ 15 బంతుల్లోనే 41 పరుగులు చేయడంతో అతని జట్టు మెల్‌బోర్న్ రెనెగడేస్..టాస్మానియా టీమ్‌పై విజయం సాధించింది. దీంతో మ్యాచ్ ముగిశాక తనను ఇంటర్వ్యూ చేస్తున్న చానెల్ 10 మహిళా ప్రెజెంటర్ మెక్ లాగ్లిన్‌తో గేల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

నీకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి కారణం ఉంది. నీ కళ్లను తొలిసారి చూసినప్పుడే నీతో మాట్లాడాలి అనిపించింది అంటూ ఆ చానెల్ లైవ్‌లోనే అందరిముందూ ఆ మహిళా రిపోర్టర్‌ను గేల్ కామెంట్ చేశాడు. అంతటితో ఆగని గేల్.. నాతో కలిసి ఏమైనా తాగడానికి రావాలి.. మీరు సిగ్గు పడకండి అం టూ చెత్త వాగుడును కంటిన్యూ చేశాడు. దీంతో అమ్మడికి చిర్రెత్తి అక్కడినుంచి వెళ్లిపోయింది. గేల్ అనుచిత వ్యాఖ్యలపై తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఫ్లింటాఫ్.. గేల్ వ్యాఖ్యలను సోషల్‌మీడియాలో తీవ్రంగా ఖండించాడు. గేల్ గతంలో కరీబియన్ లీగ్‌లోనూ ఈ తరహా అనుచిత ప్రవర్తనతో వార్తలకెక్కాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chris Gayle  Journalist  Chris gayle in an interview  Chris Gayle updates  

Other Articles