Spotted Deer Hunted in Hyderabad Central University

Spotted deer hunted in hyderabad central university

Hyderabad Central University, Deer, Hunting, Hyderabad, Shooting Range, Police, WIld act

Two persons, who allegedly killed a spotted deer at the Hyderabad Central University (HCU) campus, were arrested by the Gachibowli police on Sunday evening. On a tip off, the police raided the premises and seized the meat, legs and head kept in a bag inside the Rifle Association of Andhra Pradesh (RAAP) building. A little away, they was blood stains indicating that the animal was killed on the premises.

హైదరాబాద్ లో జింకల వేట..?

Posted: 01/04/2016 10:25 AM IST
Spotted deer hunted in hyderabad central university

వన్యప్రాణులను హింసించడం నేరం.. వాటి జోలికెళ్తే కటకటాలు లెక్కబెట్టాల్సిందే..! కానీ, ఈ హెచ్చరికలను మృగాళ్లు ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. యథేచ్ఛగా వాటిని వేటాడేస్తున్నారు. ఇవెక్కడో మారుమూల ప్రాంతంలో, అడవుల్లో జరుగుతున్న ఘోరాలు కాదు.. హైదరాబాద్‌ నగరంలో జరుగుతున్నాయి. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో వన్యప్రాణులకు రక్షణ లేకుండా పోతోంది. తాజాగా యూనివర్సిటిలో ఓ జింకను చంపి దాని చర్మం, తలను వేరు చేశారు. దాని మాంసాన్ని ఓ గదిలో దాచి ఉంచారు. అయితే అక్కడ షూటింగ్ ట్రెయినింగ్ కు వచ్చిన వారు దీన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చోటుచేసుకున్న ఈ ఘటన కలకలం రేపింది. కాగా అక్కడి షూటింగ్ రేంజ్ లోకి ఇతరులకు ప్రవేశం ఉండదు. దీన్ని ఆసరాగా చేసుకుని రేంజ్‌ ఇన్‌చార్జ్‌ గోవిందరావు, ఇద్దరు సెక్యూరిటీ గార్డులతో జింకలను చంపేస్తున్నాడు. ఇప్పటి వరకు ఆరు జింకలను చంపినట్లు పోలీసులు గుర్తించారు. విక్రయించేందుకు సిద్ధంగా ఉంచిన చర్మం, అవయవాలు, మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. జంతు సంరక్షణ అధికారులు జింకల మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hyderabad Central University  Deer  Hunting  Hyderabad  Shooting Range  Police  WIld act  

Other Articles