senior cpi leader ab bardan passes away

Cpi leader ab bardhan dead

AB Bardhan, ab bardhan dies, Communist Party of India (CPI) leader A.B. Bardhan, leftist, Maharashtra Assembly, Student leader, Bardhan paralytic stroke

Communist Party of India (CPI) leader A.B. Bardhan who was undergoing treatment from past few days died at a hospital in Delhi. He was 92.

బర్థన్ మృతి పట్ల ప్రముఖుల సంతాపం.. పేదజన పక్షపాతిగా పేర్కోన్న నేతలు

Posted: 01/03/2016 09:27 AM IST
Cpi leader ab bardhan dead

సీపీఐ సీనియర్ నేత అర్ధేందు భూషణ్ బర్ధన్ (92) శనివారం కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు తొలుత జీబీ పంత్ ఆస్పత్రిలోను, తర్వాత రాం మనోహర్ లోహియా ఆస్పత్రిలోను చికిత్స అందించారు.  శనివారం ఆయన కన్నుమూసినట్టుగా సీసీఐ జాతీయ కార్యదర్శి డి. రాజా వెల్లడించారు. అయితే పెద్ద వయసు కావడంతో చికిత్సకు శరీరం సహకరించలేదు. బర్దన్ పక్షవాతంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. 1996-2012 సంవత్సరాల మధ్య సీపీఐకి జాతీయ కార్యదర్శిగా బర్దన్ పనిచేశారు. ప్రస్తుత బంగ్లాదేశ్‌లోని బరిసల్ అనే ప్రాంతంలో ఆయన 1924 సెప్టెంబర్ 24న బర్దన్ జన్మించారు.

‘బర్ధన్ తన సిద్ధాంతాలు, నియమాలకు పూర్తిగా అంకితమైన ఒక ... కమ్యూనిస్టు నేతగా ఎల్లప్పుడూ గుర్తుంటారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలి’ అంటూ ప్రధానమంత్రి నరేం ద్రమోదీ నివాళులర్పించారు. బర్ధన్ అస్తమయంతో సీపీఐ మాత్రమే కాదు.. తన జీవితమంతా పేదలు, అణగారిన వర్గాల కోసం కృషిచేసిన ఒక మహానాయకుడిని దేశం కోల్పోయింది’ అని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ సంతాపం తెలిపారు. ‘రెడ్ సాల్యూట్ కామ్రేడ్ బర్ధన్. మీ మేధస్సు, అనుభవం, మార్గదర్శకత్వం మాకు లోలుగానే ఉంటుంది’ అంటూ సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ట్విటర్‌లో వ్యాఖ్యల ద్వారా బర్ధన్‌కు నివాళులర్పించారు.

బర్ధన్ మృతి భారత రాజకీయాలకు తీరని నష్టమని బీజేపీ నేత, కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ ట్విటర్‌లో సంతాపం తెలిపారు. ‘సాధారణ ప్రజల కోసం నిరంతరం పోరాటం సాగించిన వామపక్ష మహానాయకుడు ఆయన’ అంటూ జేడీయూ అధ్యక్షుడు శరద్‌యాదవ్ నివాళులర్పించారు. తాను పన్నెండేళ్ల వయసులో తొలిసారి బర్ధన్ ప్రసంగాన్ని విన్నానని.. రాజకీయాల్లో చేరిన తర్వాత ఆయనతో సుదీర్ఘ సంబంధం కొనసాగించానని పేర్కొన్నారు. బర్ధన్ గౌరవప్రదమైన రాజకీయాలకు, నిస్వార్థ సేవకు ప్రతిరూపమని తమిళనాడు ముఖ్యమంత్రి జె.జయలలిత కొనియాడారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AB Bardhan  ab bardhan dies  leftist  Maharashtra Assembly  Student leader  

Other Articles