Sonia Gandhi's 10 Janpath residence bigger than PM Modi's 7 RCR

Sonia gandhi s 10 janpath residence bigger than pm modi s 7 rcr

Sonia Gandhi, Modi, Sonia Gandhi House, Modis House, Parliament House, Sonias house bigger than modi home

Well it may be hard to digest, but it's a fact. Congress president Sonia Gandhi's official residence 10, Janpath is bigger than Prime Minister's residence at 7, Race Course Road. According to an RTI reply, the Congress president's home is spread over 5,181 square metre, while the Prime Minister's official abode sprawls over 14,101 square metre.

మోదీ కన్నా సోనియా ఇళ్లే పెద్దదట..!

Posted: 12/31/2015 12:11 PM IST
Sonia gandhi s 10 janpath residence bigger than pm modi s 7 rcr

దేశ ప్రధాన మంత్రి నివాసం అందరి కన్నా చాలా పెద్దగా ఉంటుందని కదా మనం అందరం అనుకుంటాం! అయితే.. నరేంద్ర మోదీ నివాసం ఉండే నెం.7 రేస్ కోర్స్ రోడ్డు నివాసం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసమైన 10 జన్‌-పథ్ కంటే చిన్నదేనట! సమాచార హక్కు ద్వారా చేసిన దరఖాస్తుతో ఈ విషయం వెల్లడైంది. ఆ మాటకొస్తే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీల ఇళ్లు మాత్రమే 10 జన్‌-పథ్ కంటే పెద్దగా ఉంటాయి. ప్రధాని సహా అందరికీ వాళ్ల పదవులను బట్టి అధికారిక నివాసాలుగా మాత్రమే ఆయా భవనాలను కేటాయించగా, సోనియా గాంధీకి మాత్రం పార్లమెంటు సభ్యురాలి హోదాతో సంబంధం లేకుండానే 10 జన్‌-పథ్-ను కేటాయించడం విశేషం.

సోనియా గాంధీ నివాసం మొత్తం 15,181 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉండగా, ప్రధాని నివాసం మాత్రం 14,101 చదరపు మీటర్లు మాత్రమే. రాష్ట్రపతి భవన్ మాత్రం అన్నింటి కంటే పెద్దగా 320 ఎకరాల్లో విస్తరించి ఉంది. ప్రపంచంలో మరే దేశాధినేతల నివాసం చూసినా దీని కంటే తక్కువే ఉందిట. 6 మౌలానా ఆజాద్ రోడ్డులోని ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ నివాసం 26,333.5 చదరపు మీటర్లు ఉంది. ఈ వివరాలన్నీ దేవాశీష్ భట్టాచార్య అనే వ్యక్తి దాఖలు చేసిన ఆర్టీఐ దరఖాస్తుతో వెల్లడయ్యాయి. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు, సోనియా కుమారుడు రాహుల్ గాంధీ 12, తుగ్లక్‌ లేన్‌-లో ఉంటున్నారు. ఆ భవనం విస్తీర్ణం 5,022 చదరపు మీటర్లు. ప్రియాంకా గాంధీ ఉండే 35 లోదీ ఎస్టేట్ బంగ్లా విస్తీర్ణం 2,765 చదరపు మీటర్లు ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles