TRS party wins MLC and congress opens victory

Trs party wins mlc and congress opens victory

MLC, Elections, TRS, Congress, MLC Results, Mahabubnagar MLC, Khammam MLC

In MLC elections TRS party continues its victory in Khammam and Mahabubnagar. In Nalgonda dist Komati reddy Rajagopal Reddy won MLC.

టిఆర్ఎస్ ప్రభంజనం.. నల్గొండలో కాంగ్రెస్ విజయం

Posted: 12/30/2015 12:59 PM IST
Trs party wins mlc and congress opens victory

స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఖమ్మంలో అధికార టిఆర్ ఎస్ పార్టీ విజయం సాధించింది . 31 ఓట్ల తేడాతో టిఆర్ఎస్ అభ్యర్ధి బాలసాని లక్ష్మీనారాయణ విజయం సాధించారు. దీంతో టిఆర్ఎస్ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.  నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్ధి కోమటి రెడ్డి రాజ గోపాల్ రెడ్డి 105 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.  మహబూబ్ నగర్ లో టిఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య హోరాహోరి నడుస్తుంది. మహబూబ్ నగర్ జిల్లా స్థానికి సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి విజయం సాధించారు. సమీప కాంగ్రెస్ అభ్యర్థి దామోదర్ రెడ్డిపై 65 ఓట్ల ఆధిక్యంతో నారాయణరెడ్డి గెలుపొందారు. తెరాస అభ్యర్ధి నారాయణరెడ్డికి 445, కాంగ్రెస్ అభ్యర్ధి దామోదర్ రెడ్డికి 380 ఓట్లు పోలయినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. బుధవారం ఉదయం ఓట్లు లెక్కింపు ప్రారంభం  నుంచే తెరాస అభ్యర్ధి, సమీప కాంగ్రెస్ అభ్యర్ధి కన్నా ముందంజలో కొనసాగుతూ వచ్చారు.

జిల్లాలో స్థానిక సంస్థల్లో మెజారిటీ బలమున్న తాము ఎమ్మెల్సీ సీటును కైవసం చేసుకుంటామని రాజగోపాల్ రెడ్డి సోదరుడు, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. తన సోదరుడు ఓటమిపాలైతే, తాను రాజకీయాల నుంచే తప్పుకుంటానని ఆయన ప్రకటించారు కూడా. వెంకటరెడ్డి చెప్పినట్లుగానే నేటి ఉదయం ప్రారంభమైన కౌంటింగ్ లో ఆది నుంచి రాజగోపాల్ రెడ్డి ఆధిక్యం సాధించారు. ఏ దశలోనూ వెనకబడని ఆయన చిన్నపరెడ్డికి షాకిస్తూ 158 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. రాజగోపాల్ రెడ్డికి 616 ఓట్లు పడగా, చిన్నపరెడ్డి మాత్రం 458 ఓట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో నల్గొండ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు. 192 ఓట్ల తేడాతో టిఆర్ఎస్ అభ్యర్ధి తేరా చిన్నప రెడ్డిపై భారీ విజయం సాధించారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే ఖమ్మంలో అధికార టిఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. మహబూబ్ నగర్ లో టిఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరి నడుస్తుంది. కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ తన గెలుపునకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.  తెలంగాణలో కుటుంబ పాలన కొనసాగుతోందంటూ అధికార పార్టీని విమర్శించారు. నల్గొండ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MLC  Elections  TRS  Congress  MLC Results  Mahabubnagar MLC  Khammam MLC  

Other Articles