Cop thrashes youth and abuses girl friend

Cop thrashes youth and abuses girl friend

Police, Thane, Ulhasnagar , Police attack on youth, maharastra, viral video

A video purportedly showing a police officer thrashing a youth and abusing his female friend has surfaced on social media.The latest incident of alleged moral policing was reported from Ulhasnagar area of neighbouring Thane district. The video, which went viral on social media platforms yesterday, shows the officer, who was accompanied by a constable, beating the youth after asking him a few questions.

ITEMVIDEOS: అబ్బాయిని కొట్టి.. అమ్మాయిని తిట్టిన పోలీసులు

Posted: 12/30/2015 11:20 AM IST
Cop thrashes youth and abuses girl friend

మహారాష్ట్రలో మరో మోరల్ పోలీసింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఇందులో పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. ధానే జిల్లాలోని ఉల్మాసన్ నగర్ లో ఓ యువకుడిని తిడుతూ కొట్టడమే కాకుండా ఆ అబ్బాయితో పాటు ఉన్న యువతిని నోటికి వచ్చినట్లు తిట్టారు. అయితే వారు ఆటోలో కూర్చొని మిస్ బిహేవ్ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే తాము ట్యూషన్ నుండి వస్తున్నామని ఆ యువతి పోలీసులకు చెబుతున్న క్లిప్పింగ్ కనిపించింది. అయితే ఈ ఘటన ఎప్పుడు జరిగింది అన్న దాని మీద క్లారిటీ లేదు.

ధానే జిల్లాలోని ఉల్మాసన్ నగర్ లోని ఓ వీధిలో ఓ యువకుడు, మరో యువతితో ఆటోలో కూర్చున్నారట. అయితే గత కొంత కాలంగా హోటల్స్, రిసార్ట్ లలో పెళ్లి కాని, మిస్ బిహేవ్ చేస్తున్న జంటలను పోలీసులు ఉతికేస్తున్నారు. అందులో భాగంగా ఓ పోలీస్ ఉన్నతాధికారి, అతడితో పాటు మరో కానిస్టేబుల్ అబ్బాయి మీద చేయి చేసుకున్నారు. అంతేకాకుండా అమ్మాయిని పచ్చిగా తిట్టారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తి తన కెమెరాలో షూట్ చేశారు. దాన్ని సోషల్ మీడియాలో పెట్టేసరికి చాలా పాపులర్ అయింది. అయితే దీని మీద పోలీసులు మాత్రం తమకు ఎలాంటి సంబందం లేదని అంటున్నారు. అయితే మోరల్ పోలీసింగ్ తప్పు అని చట్టాలు ఉన్నా ఇలా చెయ్యడం  ఏంటీ అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Police  Thane  Ulhasnagar  Police attack on youth  maharastra  viral video  

Other Articles