Danam Nagender, Followers Thrashed and Chased Away by RR District Congress Men

Danam nagender attacked by mallesh goud followers in uppal

danam nagender, mallesh goud, ghmc congress president, Rangareddy dcc president, km pratap, mallesh goud danam nagender, RR dcc president mallesh goud

The city Congress party president Danam Nagender and his followers were thrashed and chased away by the party's Ranga Reddy district cadres from the venue of a flag hoisting ceremony in Uppal.

ITEMVIDEOS: దానం నాగేందర్, అనుచరులపై మల్లేష్ గౌడ్ అనుయాయువుల దాడి

Posted: 12/28/2015 03:39 PM IST
Danam nagender attacked by mallesh goud followers in uppal

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు దానం నాగేందర్‌కు నగరంలో చేదు అనుభవం ఎదురైంది. సోమవారం ఉప్పల్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గోన్న దానం నాగేందర్ సహా అతని అనుచరులపై కోడిగుడ్లతో దాడులు చేశారు అదే పార్టీకి చెందిన పలువురు. వివరాల్లోకి వెళ్తే.. కాంగ్రెస్ 131వ అవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉప్పల్ లో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఆ కార్యక్రమానికి ముందుగానే హాజరైన రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లేష్ గౌడ్ ముందుగా పార్టీ జెండాను ఎగురవేశారు.

ఆలస్యంగా అక్కడికి చేరుకున్న దానం నాగేందర్, అతని అనుచరులు జెండాను కిందకు దించి.. మరో జెండాను మళ్లీ దానం చేత ఎగురవేయించారు. ఈ విషయం తెలుసుకున్న మల్లేష్ గౌడ్ అనుచరులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని దానం నాగేందర్, అతని అనుచరులపై కోడిగుడ్లతో దాడి చేశారు. దానం అనుచరులను అక్కడి నుంచి తరమి కోట్టారు. దానం నాగేందర్ పై కూడా మల్లేష్ గౌడ్ చేయి చేసుకున్నాడని సమాచారం. అనూహ్యపరిణామాల నేపథ్యంలో దానం తన అనుచర గణంతో అక్కడి నుంచి వెళ్లిపోయారని సమాచారం. రంగారెడ్డి జిల్లా కార్యక్రమాల్లో పాల్గొన వద్దని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

నా పై దాడి జరగలేదు దానం నాగేందర్

కాగా ఉప్పల్ లోని పార్టీ కార్యక్రమంలో తనపై దాడి జరిగిందని వస్తున్న వార్తల్లో నిజం లేదని కాంగ్రెస్ సినీయర్ నేత, మాజీ మంత్రి దానం నాగేందర్ అన్నారు. తనపై మల్లేష్ గౌడ్ సహా, ఆయన అనుచరులు ఎవ్వరూ దాడి చేయలేదని చెప్పారు. పార్టీ అవిర్భావ కార్యక్రమంలో పార్టీ పతాకాన్ని ఎగురువేస్తున్న క్రమంలో మల్లేష్ గౌడ్ వర్గీయులు అభ్యంతరం తెలిపారని, అంతేకాని దాడులు జరగలేదన్నారు. అయితే ఇరువర్గాలకు చెందిన కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని, అది తీవ్రస్థాయికి చేరడంతో అనుచరుల మధ్య తొపులాట కూడా చోటుచేసుకుందని దానం తెలిపారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : danam nagender  mallesh goud  ghmc congress president  Rangareddy dcc president  

Other Articles