Telugu states suffering with winter winds

Telugu states suffering with winter winds

Winter, Cold, Telugu States, AP, Telangana

From last two days temperature decreased to single digit in the night. Some places record least temperature ever.

తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి

Posted: 12/28/2015 08:42 AM IST
Telugu states suffering with winter winds

ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలులు తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్నాయి. ఏజెన్సీ గ్రామాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. మరో ఐదు రోజుల వరకు అతి శీతల గాలులు వీస్తాయని అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. దీంతో ఏపీ, తెలంగాణలో ఈ నెలాఖరు వరకు చలి తీవ్రత ఉంటుంది. ఏపీ, తెలంగాణలో ఉన్నట్టుండి వాతావరణం మారిపోయింది. రెండు రోజులుగా ఉదయం, సాయంత్రం వేళల్లో చలిగాలులు వణికించేస్తున్నాయి. పొద్దున పది గంటలకు కూడా చలి తగ్గటం లేదు. పగటి పూట కాస్త ఎండగా ఉంటున్నా..చలి ప్రభావం కనిపిస్తోంది.

మన్యంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఏపీలో విశాఖ, శ్రీకాకుళం జిల్లాలతో పాటు..తెలంగాణలో ఆదిలాబాద్‌ ఏజెన్సీ గ్రామాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. ఈ సీజన్‌లోనే అతి తక్కువ టెంపరేచర్లు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్‌ ఏజెన్సీలో రెండ్రోజుల నుంచి నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. మెదక్‌లో 8, రామగుండంలో 9, హైదరాబాద్‌లో 13 డిగ్రీలకు టెంపరేచర్ పడిపోతోంది. ఈ సీజన్‌లో నమోదవ్వాల్సినదానికంటే మూడు నాలుగు డిగ్రీలు తక్కువకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. చిన్న పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉత్తరాది నుంచి చలిగాలులు తెలుగు రాష్ట్రాల వైపు మళ్లటమే ఈ పరిస్థితికి కారణమంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. మొన్నటి వరకు ఉపరితల ఆవర్తనంతో గాలిలో తేమ ఉండటం వల్ల పెద్దగా చలి అనిపించలేదని..ఇప్పుడు తేమ తగ్గటంతో పాటు..ఉత్తరాది గాలుల తీవ్రతతో చలి ఒక్కసారిగా పెరిగిందంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Winter  Cold  Telugu States  AP  Telangana  

Other Articles