Bridegroom got call and he escape from marriage

Bridegroom got call and he escape from marriage

Warangal, Marriage, Bridegroom, bridegroom escape from Marriage

Bridegroom got call and he escape from marriage. In Warangal dist parakala bridegrom escape from marriage after a phone call from unknown person.

ఫోన్ రింగైంది.. పెళ్లి కొడుకు జంప్

Posted: 12/28/2015 09:13 AM IST
Bridegroom got call and he escape from marriage

ఏం జరిగిందో తెలియదు.. బంధువులతో కళకళలాడాల్సిన పచ్చని పెళ్లి పందిరి ఏడుపులు, పెడబొడ్డలతో విలపించింది. మరికొద్ది సేపట్లో పెళ్లి జరగాల్సిన చోట.. పెళ్లి కూతురు తల్లిదండ్రులు వెక్కి వెక్కి ఏడిచారు. పెళ్లి కొడుకు చెప్పా చెట్టకుండా.. చెక్కేయడంతో వరంగల్ లో ఓ పెళ్లి పందిరిలో మారిన పరిస్థితి ఇది. అయితే పెళ్లి కొడుకుకు వచ్చిన ఓ ఫోన్ కాల్ వల్ల పెళ్లి ఆగిపోయిందని అనుకుంటున్నారు. వరంగల్‌ జిల్లా హసన్‌పర్తి మండల కేంద్రానికి చెందిన అమ్మాయికి వర్ధన్నపేట మండలం మైలారం గ్రామానికి చెందిన రఘు గౌడ్‌తో వివాహం నిశ్చయించారు. పెళ్లికి అంతా సిద్దమైన టైంలో పెళ్లి కొడుకు కనిపించకుండా వెళ్లిపోయింది.

పరకాల ఎల్‌ఐసీ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్న రఘుకు కట్నం కింద 20 లక్షలు, ఇతర లాంఛనాలు ఒప్పుకొన్నారు. నవంబర్‌ 19న నిశ్చతార్థం సందర్భంగా 18 లక్షలు ముట్టజెప్పారు. ఆదివారం ఉదయం భీమారంలోని ప్రొద్దుటూరు గార్డెన్స్‌లో పెళ్లి జరగాల్సి ఉంది. ఇంతలో శనివారం రాత్రి 8 గంటలకు అపరిచిత వ్యక్తి నుంచి రఘుకి ఫోన్‌కాల్‌ వచ్చింది. ఏం మాట్లాడుకున్నారో తెలియదు. వెంటనే వరుడు ఫోన్‌ స్విచ్ ఆఫ్‌ చేసి మాయమయ్యాడు. ఈ విషయం తెలిసిన అమ్మాయి తరఫు వారు రఘు తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి అడిగితే బయటకు వెళ్లాడు, వస్తాడంటూ దాటవేశారు. ఉదయం అమ్మాయి తరఫు పెళ్లి పందిరికి రాగా.. అక్కడ ఎవరూ లేక పోవడంతో షాక్‌ అయ్యారు. అమ్మాయి తల్లిదండ్రులు ఒక్కసారిగా కూలబడిపోయి బోరున విలపించారు. కాగా ఇరువర్గాలవారు పరస్పరం హసనపర్తి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Warangal  Marriage  Bridegroom  bridegroom escape from Marriage  

Other Articles