Fire breaks out | Erravelli yagashaala | fire controlled in minutes | KCR | Ayuta Chandi Yaagam

Fire breaks out at erravelli yaagashaala controlled in minutes

Fire Breaks Out at Erravelli Yaagashaala, fire at chandi yagam controlled in Minutes, Fire breaks out, Erravelli yagashaala, Controlled in Minutes, KCR, Ayuta Chandi Yaagam, president pranab mukharjee, governer narasimhan

Fire broke out at the Yaagashaala of Ayuta Chandi Yaagam at Erravelli hours before the conclusion of the historical five-day religious event.

చండీయాగంలో అపశృతి.. యాగశాలకు నిప్పు.. క్షణాల్లో చల్లార్చిన సిబ్బంది

Posted: 12/27/2015 03:51 PM IST
Fire breaks out at erravelli yaagashaala controlled in minutes

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అయుత మహాచండీయాగంలో చివరిరోజు అపశృతి చోటుచేసుకుంది. యాగం నిర్వహిస్తున్న యాగశాలలో గత ఐదు రోజులుగా చేస్తున్న యాగానికి వేడెక్కిన యాగశాల పైకప్పుకు నిప్పు అంటుకుని అగ్నిప్రమాదం సంభవించింది. హోమంలో మంటలు చెలరేగి యాగశాల మంటపం పైభాగానికి వ్యాపించాయి. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. దీంతో అక్కడున్నవారంతా భయాందోళనతో చెల్లాచెదురయ్యారు.

తొక్కిసలాట జరగకుండా పోలీసులు బారికేడ్లు తొలగించారు. యాగశాలలో ఉన్న ప్రముఖులు, ప్రజలను బయటకు పంపించారు. మూడు అగ్నిమాపక శకటాల సాయంతో అగ్నిప్రమాక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఒకేసారి పెద్ద మొత్తంలో హోమగుండంలో ఆవు నెయ్యి వేయండంతో మంటలు చెలరేగాయి. యాగ విరామ సమయంలో మంటలు అంటుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. నిమిషాల వ్యవధిలోనే మంటలను అదుపులోకి తేవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. భక్తులు ఆందోళన చెందాల్సిన పనిలేదని, యాగం యధావిధిగా కొనసాగుతుందని కేసీఆర్ ప్రకటించారు.

రుద్రుడు, చండీలు సంతోషానికి ఇది సంకేతం

అయుత మహా చండీయాగం పూర్ణాహుతి అయిన తర్వాత మొత్తం పాకలన్నీ కూడా కాల్చేయాలని అని శాస్త్రం చెబుతోందని విశాఖపట్టణానికి చెందిన శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. కానీ, దానికి ముందే పూర్ణాహుతి జరిగిందని, పూర్తి ఏ రకమైన అరిష్టాలు లేకుండా.. ముందుగానే భగవంతుడు ఆయనే దాన్ని దహనం చేశాడు తప్పా, ఇదేమి అరిష్టం కాదని.. రాష్ట్రానికి చాలా మేలని.. చాలా గొప్ప చేసిందని స్వామిజీ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అయుత మహా చండీయాగానికి పరమరుద్రుడు, చండీ ఇద్దరూ కూడా చాలా సంతోషించారని, చాలా గొప్పగా ఈ యాగాన్ని కేసీఆర్ జరిపించారని స్వామిజీ అన్నారు.

వెనుదిరిగిన రాష్ట్రపతి

ఈ మధ్యాహ్నం ఎర్రవల్లి చేరుకున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చండీయాగంలో పాల్గొనకుండానే వెనుదిరిగారు. చండీయాగంలో మంటలు వ్యాపించడంతో యాగప్రాంగణంలో కలకలం రేగింది. సరిగ్గా అదే సమయానికి హెలికాప్టర్ లో రాష్ట్రపతి అక్కడకు చేరుకున్నారు. అయితే పరిస్థితి ఉద్రిక్తంగా ఉండడంతో రాష్ట్రపతి కిందకు దిగకుండానే వెనుదిరిగారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Fire breaks out  Erravelli yagashaala  Controlled in Minutes  KCR  Ayuta Chandi Yaagam  

Other Articles