PM Narendra Modi satisfied with DBT implementation

Pm narendra modi addresses to nation on mann ki baat

india, direct benefit transfer scheme, india, mann ki baat, nation news, pm narendra modi

Addressing the 15th edition of the Mann ki Baat, Prime Minister Narendra Modi expressed satisfaction over the successful implementation of Direct Benefit Transfer (DBT) scheme.

వివేకానందుని జన్మదినాన్ని యువజనదినోత్సవంగా జరుపుకుందాం

Posted: 12/27/2015 02:06 PM IST
Pm narendra modi addresses to nation on mann ki baat

జాతీయ నగదు బదిలీ పథకం అమలు తీరుపై ప్రధాని నరేంద్ర మోడీ సంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈ పథకానికి గిన్నిస్ రికార్డు లభించిందని గుర్తు చేసిన ఆయన, ఈ పథకం విజయవంతంగా అమలవుతోందని కితాబిచ్చారు. భారత ప్రజలందరికీ క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ 15వ విడత తన మనస్సులోని మాటను దేశ ప్రజలతో పంచుకున్నారు. ఇండియా వేగం గా అభివృద్ధి చెందుతోందని తెలిపిన ఆయన, అందుకు ఉత్సాహవంతులైన యువతే కారణమని కొనియాడారు. మారుమూల ప్రాంతాలకు విద్యుత్ అందుతోందని తెలిసి తనకెంతో సంతోషం కలుగుతోందని, దేశంలోని అన్ని ప్రాంతాలకూ విద్యుత్ సరఫరా తమ ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రపంచమంతా భాగస్వామ్యం కావడం భారత్ కు గర్వకారణమని అన్నారు.

పర్యాటక ప్రాంతాల్లో స్వచ్ఛతకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నానన్నారు. అలా చేస్తే, విదేశాల్లో మన ప్రతిష్ఠ మరింతగా పెరుగుతుందన్నారు. స్వచ్ఛ భారత్ ను ప్రోత్సహించడంలో మొత్తం మీడియా పలు కథనాలు ప్రచురిస్తుండటం అభినందనీయం. 'స్టార్టప్ ఇండియా'తో ఎన్ఐటీలు, ఐఐటీలు, ఐఐఎం తదితరాల మధ్య అనుసంధానం పెరిగింది. ఈ కార్యక్రమం వల్ల యువత అపారమైన అవకాశాలను అందిపుచ్చు కోనుందని అశాభావం వ్యక్తం చేశారు. జనవరి 26న రిపబ్లిక్ దినోత్సవం నాటికి మహా పురుషుల విగ్రహాలు, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని పిలుపునిచ్చారు. ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జాతీయ యువజనోత్సవం జరుపుకుందామన్నారు. ఛత్తీస్ గఢ్ కేంద్రంగా ఈ ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించామని ప్రధాని వివరించారు.


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india  direct benefit transfer scheme  india  mann ki baat  nation news  pm narendra modi  

Other Articles