Simbu's Mom Offers Her Life for Son's Fault

We re hounded will leave state simbu s mother

simbu, usha rajendar, beep song, anirudh, Shimbu mother Usha Rajendar, Actor Simbu, Usha Rajendar Sensational comments, Tamil Nadu

The family of Tamil actor Simbu, who is on the run following the controversy over his beep song, is in big trouble these days.

ITEMVIDEOS: రాష్ట్రం వదలి వెళ్లిపోతాం.. శింబును వదిలేయండీ.. కన్నతల్లి అవేదన

Posted: 12/25/2015 02:16 PM IST
We re hounded will leave state simbu s mother

తమిళనాడు వదిలి వెళ్లిపోతామని నటుడు శింబు తల్లి, దర్శక, నిర్మాత, నటుడు టి.రాజేందర్ భార్య ఉషారాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నటుడు శింబు రాసి, పాడిన బీప్ సాంగ్ మహిళలను అవమానించే విధంగా ఉందంటూ కొద్ది రోజులుగా తమిళనాడును కుదిపేస్తోంది. శింబు, ఆ పాటకు బాణీలు కట్టిన అనిరుధ్‌లపై కేసులు నమోదు చేసి, వారి అరెస్ట్‌కు రంగం సిద్ధం చేస్తున్నారు. శింబు పరారీలో ఉన్నట్లు సమాచారం. పాటల కచేరీ కోసం కెనడా వెళ్లిన అనిరుధ్ ఇంకా చెన్నైకి తిరిగి రాలేదు.

ఇప్పటికే పోలీసులు శింబు,అనిరుధ్ కోసం గాలిస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో శింబు తల్లి ఉషారాజేందర్ గురువారం విడుదల చేసిన ఒక వీడియో సంచలనం రేపింది. అందులో ఆమె తన కొడుకుపై కుట్ర జరుగుతోందని కన్నీటిపర్యంతమయ్యారు.  ‘ఏమి రాష్ట్రం ఇది. ఇక్కడ జీవించలేం. తమిళ నాడు వదిలి ఏ కర్ణాటకకో, కేరళకో వెళ్లి మా బతుకు మేము బతుకుతాం’ అని కంటతడి పెట్టారు. ఇంతకుముందు ఇలాంటి వ్యాఖ్యలే ప్రముఖ నటుడు కమలహాసన్ విశ్వరూపం విడుదల సమయంలో కూడా చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shimbu mother Usha Rajendar  Actor Simbu  Sensational comments  Tamil Nadu  

Other Articles