No place for the grinch in India; Christmas stands for celebration of goodwill

India has more to cheer about this christmas

Christians in India Christmas celebrations Santa Claus, Worldwide, Christmas celebrations, Bishop of Goa, pm modi, medak churh, Rajnath Singh Right wing Hindutva

Christmas, in its present form, marks celebration across the world; and what it celebrates, besides commerce, is life itself, urging peace on earth and goodwill to all.

దేశవ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్.. క్రైస్తవులకు వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు

Posted: 12/25/2015 02:12 PM IST
India has more to cheer about this christmas

ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వాతావరణం నెలకొంది. క్రిస్మస్ ట్రీలు, స్టార్లతో ఇళ్లు, చర్చిలు కళకళలాడుతున్నాయి. ప్రపంచం లోని వివిధ నగరాలతో పాటు దేశ రాజధాని ఢిల్లీ,దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలు  క్రిస్మస్ శోభతో కాంతులీనుతున్నాయి. ఎక్కడ చూసినా శాంటాక్లాజ్ డ్రస్సుల్లో చిన్నారుల సందడే. ఇక పెద్దలు స్వీట్లు, కేక్‌లు పంచుకుంటూ ఒకరికొకరు అభినందనలు తెలుపుకుంటున్నారు. ఇక చర్చీలలో ప్రత్యేక ప్రార్థనలతో క్రైస్తవులు బారులు తీరుతున్నారు. భక్తిశ్రద్దలతో ప్రార్థనలు చేస్తున్నారు.
 
ప్రముఖుల శుభాకాంక్షలు

క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రులు, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా పలు పార్టీలకు చెందిన ప్రముఖులు శుభాకాంక్ష్లు తెలిపారు. ఢిల్లీ క్రైస్తవులకు అరవింద్ కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ ప్రజలకు మమతా బెనర్జీ, తమిళనాడు గవర్నర్ రోశయ్య, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్, గవర్నర్ నరసింహన్, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తదితరులు క్రిస్టియన్లకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.

బాలీవుడ్ నటీనటుల శుభాకాంక్షలు


శాంతికాముకుడు యేసుక్రీస్తు జన్మిదినాన్ని పురస్కరించుకుని క్రైస్తవులు జరుపుకుంటున్న పండగ క్రిస్మస్ సందర్భంగా బాలీవుడ్ సెలబ్రీటీలు క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. గాయిని లతా మంగేష్కర్, పర్హాన్ అక్తర్, అనుష్క శర్మ, అన్షుమన్ ఖురానా, హేమా మాలిని, మనీష్ మల్హోత్రా, లారా దత్తా భూపతి, ఫరా ఖాన్, కపిల్, వివేక్ ఒబరాయ్ తదితరులు తమ అభిమానులకు సామాజిక మాధ్యమం ద్వారా శుభాకాంక్షలను తెలిపారు. ఈ పండగ అమ అభిమానులల్లో ప్రేమ, ఆప్యాయత, అనురాగం, శాంతి, సంతోషాలను కలగజేయాలని వారు కోరుకుంటూ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

దేదీప్యమానంగా కాంతులీనుతున్న మెదక్ చర్చ్

క్రిస్మస్ వేడుకలకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ సీఎస్‌ఐ చర్చి ముస్తాబైంది. క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకుని చర్చిని మిరుమిట్లు గొలిపే విద్యుద్దీపాలతో అందంగా అలంకరించారు. తెల్లవారుజామున నాలుగు గంటలకు  భక్తులను ఉద్దేశించి మెదక్ డయాసిస్ వైస్‌చైర్మన్ ఏసీ సాలమోన్‌రాజు సందేశమిచ్చారు. ఉదయం పది గంటలకు రెండో ఆరాధన నిర్వహించారు. మెదక్ డయాసిస్ పరిధిలోని మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి, వివిధ దేశాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
 
అసహనంపై గోవా బిషప్ ఆందోళన

దేశంలో పెరుగుతున్న అసహనం తీవ్రత ప్రజల జీవితాలపై ప్రభావం చూపుతోందని ఆర్చ్‌బిషప్ ఆఫ్ గోవా ఫిలిప్ నెరి ఫెర్రావో ఆందోళన వ్యక్తం చేశారు. వివిధ వర్గాలు, సంస్కృతుల ప్రజల మధ్య  అసహనం పెరుగుతోందన్నారు. అవగాహన, సయోధ్య, శాంతి మొదలైన వాటి ద్వారా అసహనానికి అడ్డుకట్ట వేయవచ్చని ఆయన తన క్రిస్మస్ సందేశంలో స్పష్టం చేశారు. అయితే గతంలో క్రైస్తవ మత ప్రచారకులపై జరిగిన దాడులు.. ఈ ఏడాది మాత్రం ఎక్కడ కనబడలేదని, పలువురు పేర్కోంటున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Santa Claus  Worldwide  Christmas celebrations  Bishop of Goa  pm modi  

Other Articles